సిస్టర్ సెంటిమెంట్‌తో
ABN , Publish Date - Oct 01 , 2024 | 04:04 AM
రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వీ ప్రధాన పాత్రలు పోషించిన ‘చిట్టి..పొట్టి’ చిత్రం ట్రైలర్‌ను యూనిట్ విడుదల చేసింది. భాస్కర్ యాదవ్ దాసరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా...
రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వీ ప్రధాన పాత్రలు పోషించిన ‘చిట్టి..పొట్టి’ చిత్రం ట్రైలర్‌ను యూనిట్ విడుదల చేసింది. భాస్కర్ యాదవ్ దాసరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ఇది. ఈ సందర్భంగా దర్శకనిర్మాత మాట్లాడుతూ ‘అన్నా చెల్లెలు అనుబంధం కథాంశంగా రూపుదిద్దుకున్న సినిమా ఇది. చెల్లెలుగా, మేనత్తగా, చివరికి బామ్మగా .. ఓ మహిళ జీవితంలోని ఎమోషనల్ జర్నీనీ ఇందులో చూపించాం. అక్టోబర్ 3న విడుదల చేస్తున్నాం’ అని చెప్పారు.