సంక్రాంతికి ఒకే నిర్మాత చిత్రాలు పోటీపడతాయా?

ABN , Publish Date - Oct 11 , 2024 | 06:44 AM

రామ్‌ చరణ్‌ నటిస్తున్న ‘గేమ్‌ చేంజర్‌’ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదలవుతుందని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు అభిమానులు. అయితే తాజాగా అందిన సమాచారం మేరకు ఈ చిత్రం క్రిస్‌మ్‌సకి కాకుండా.. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అయ్యే చాన్స్‌ ఉన్నట్లు...

రామ్‌ చరణ్‌ నటిస్తున్న ‘గేమ్‌ చేంజర్‌’ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదలవుతుందని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు అభిమానులు. అయితే తాజాగా అందిన సమాచారం మేరకు ఈ చిత్రం క్రిస్‌మ్‌సకి కాకుండా.. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అయ్యే చాన్స్‌ ఉన్నట్లు టాక్‌ వినిపిస్తోంది. దీనిక్కారణం సంక్రాంతికి ముందు నుంచి విడుదల అవుతుందనుకుంటున్న ‘విశ్వంభర’ వాయిదా పడే అవకాశం ఉండడమే. వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రం సీజీ వర్క్‌ ఆలస్యం అవుతుండడంతో.. సంక్రాంతి రేసు నుంచి వేసవికి విడుదలను మార్చుకుందని తెలుస్తోంది. దాంతో జనవరి 10న విడుదల కావాల్సిన ఈ సినిమా స్థానంలో రామ్‌చరణ్‌ మూవీని విడుదల చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. అయితే.. ‘గేమ్‌ చేంజర్‌’ చిత్రాన్ని శంకర్‌ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.


మరోవైపు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్‌ నటిస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా సంక్రాంతికే విడుదల అవుతోంది. దీనిక్కూడా నిర్మాత దిల్‌రాజునే. మరి ఒకే నిర్మాత నిర్మించిన రెండు అగ్ర హీరోల చిత్రాలు బాక్సాఫీస్‌ దగ్గర పోటీ పడతాయా.. లేదా... ఈ రెండు సినిమాల్లో ఏదో ఒక సినిమా వెనక్కి తగ్గుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Updated Date - Oct 11 , 2024 | 06:45 AM