థియేటర్లో విజిల్స్ పడేలా... ‘బచ్చన్’
ABN , Publish Date - Aug 11 , 2024 | 12:42 AM
నిర్మాతగా వరుస సినిమాలను నిర్మిస్తూ.. టాప్ గేర్‌లో దూసుకుపోతున్నారు టీ.జీ.విశ్వప్రసాద్. ఆయన లేటె్‌స్టగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో రవితేజ నటించిన ‘మిస్టర్ బచ్చన్’ నిర్మించారు...
నిర్మాతగా వరుస సినిమాలను నిర్మిస్తూ.. టాప్ గేర్‌లో దూసుకుపోతున్నారు టీ.జీ.విశ్వప్రసాద్. ఆయన లేటె్‌స్టగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో రవితేజ నటించిన ‘మిస్టర్ బచ్చన్’ నిర్మించారు. ఈ నెల 15న సినిమా విడుదలవుతున్న సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ‘‘ఇది కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉన్న సినిమా. మాస్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేస్తుంది. ఈ సినిమాను హరీశ్ తన మేకింగ్ స్కిల్స్‌తో ఎక్కడికో తీసుకుపోయాడు. రవితేజ, భాగ్యశ్రీ భోర్సే మధ్యన జరిగే ప్రేమకథ అలరిస్తుంది. మిక్కీజే.మేయర్ మంచి పాటలను ఇచ్చారు. ఈ సినిమా అవుట్‌పుట్ అనుకున్నదాని కంటే చాలా బాగా వచ్చింది. థియేటర్లో వచ్చే యాక్షన్ సన్నివేశాలకు ప్రేక్షకుల నుంచి విజిల్స్ పడతాయి’’ అని చెప్పారు.