విజయదశమికి ‘కార్తీకేయ 3’ను ప్రకటిస్తాం

ABN , Publish Date - Aug 08 , 2024 | 04:26 AM

‘కార్తీకేయ’, ‘సుబ్రమణ్యపురం’, ‘కథలో రాజకుమారి’ చిత్రాలతో మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు వెంకట శ్రీనివాస్‌ బొగ్గరం. ఆయన ఇటీవలే మీడియాతో ముచ్చటించి..

‘కార్తీకేయ’, ‘సుబ్రమణ్యపురం’, ‘కథలో రాజకుమారి’ చిత్రాలతో మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు వెంకట శ్రీనివాస్‌ బొగ్గరం. ఆయన ఇటీవలే మీడియాతో ముచ్చటించి.. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘కార్తీకేయ 3’ సినిమా గురించి ఓ ఆసక్తికర అప్‌డేట్‌ను అందించారు.

‘‘కార్తీకేయ’ మొదటి భాగం విడుదలై పదేళ్లు అవుతున్న సందర్భంగా అక్టోబరులో విజయదశమి రోజున ‘కార్తీకేయ 3’ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నాము. ఆ రోజే సినిమా గురించి మరిన్ని వివరాలు వెల్లడిస్తాము. ‘కార్తీకేయ 2’ సంచలన విజయం సాధించడంతో మూడో భాగంపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. అందరి అంచనాలు నిలబెట్టుకోవడానికి స్ర్కిప్టు విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తున్నాం. డివోషనల్‌ టచ్‌ ఉండేలా హనుమంతుడి స్ఫూర్తితో ‘యతి’ అనే సినిమాను.. శివుడి స్ఫూర్తితో ‘మహాయోగి’ అనే మరో సినిమాను నిర్మిస్తున్నాను’’ అని చెప్పారు.

Updated Date - Aug 08 , 2024 | 04:26 AM