ఆ స్వేచ్ఛ మాకూ ఉంది
ABN , Publish Date - Nov 18 , 2024 | 04:05 AM
‘ఒక సినిమా బాగోగుల గురించి విమర్శకులు, సమీక్షకులు ఎంతటి విశ్లేషణ అయినా చేయవచ్చు కానీ ఆ వంకతో వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా ఉండకూడదు. మీలాగామాకూ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందని గుర్తుంచుకోవాలి...
‘ఒక సినిమా బాగోగుల గురించి విమర్శకులు, సమీక్షకులు ఎంతటి విశ్లేషణ అయినా చేయవచ్చు కానీ ఆ వంకతో వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా ఉండకూడదు. మీలాగామాకూ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందని గుర్తుంచుకోవాలి’ అని హీరో విష్వక్‌సేన్ అన్నారు. ఆయన కథానాయకుడిగా రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించిన చిత్రం ‘మెకానిక్ రాకీ’. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలు. రామ్ తాళ్లూరి నిర్మాత. ఈ నెల 22న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం వరంగల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. విష్వక్‌సేన్ మాట్లాడుతూ ‘‘మెకానిక్ రాకీతో మా నిర్మాత రామ్ గర్వపడేలా చేస్తా. పది సినిమాల అనుభవంతో చెబుతున్నా మంచి సినిమా తీశాం. ఐదు నిమిషాలు కూడా బోర్‌కొట్టదు. మా సినిమాను ఆదరించండి’ అని ప్రేక్షకులను కోరారు. రామ్ తాళ్లూరి మాట్లాడుతూ ‘విష్వక్‌సేన్ కష్టపడి, ఇష్టపడి చేసిన సినిమా ఇది. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలున్నాయి.
మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు. యువతను, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో తెరకెక్కిన చిత్రమిదని మీనాక్షి చౌదరి తెలిపారు. సందేశం, వినోదం కలబోతగా రూపొందిన చిత్రమిదని శ్రద్ధా శ్రీనాథ్ చెప్పారు.