అశ్లీల చిత్రాలు చూడమన్నారు

ABN , Publish Date - Sep 30 , 2024 | 02:04 AM

తనను లైంగికంగా వేధించారంటూ హీరో జయసూర్య సహా పలువురు మలయాళ సినీ ప్రముఖులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి మిను మునీర్‌ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు...

తనను లైంగికంగా వేధించారంటూ హీరో జయసూర్య సహా పలువురు మలయాళ సినీ ప్రముఖులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి మిను మునీర్‌ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. దర్శకుడు బాలచంద్ర మీనన్‌ సైతం తనను లైంగికంగా వేధించారని ఆమె సోషల్‌ మీడియా ద్వారా ఆరోపించారు. ‘‘2007లో నన్ను తన గదికి పిలిపించుకున్న బాలచంద్ర అశ్లీల చిత్రాలు చూడాలని బలవంతం చేశారు, ‘నువ్వు నాకు తోడుగా ఉండాల’ని అడిగారు, నేను వెంటనే అక్కడ నుంచి బయటకు వచ్చాను’’ అని ఆమె తెలిపారు. మాలీవుడ్‌లో వేధింపులు తట్టుకోలేక తమిళ సినిమాలు చేసుకుంటూ చెన్నైలో ఉంటున్నానని మిను మునీర్‌ తెలిపారు.

Also Read- Aishwarya Lekshmi: నన్ను సింగిల్‌గా ఉండనివ్వరా..



ఇదిలా ఉంటే మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి జస్టిస్‌ హేమ కమిటీ (Hema Committee Report) ఓ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే! ప్రస్తుతం ఎక్కడ చూసిన దీనిపైనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే నటీమణులకు ఎలాంటి సమస్యలు ఉన్నాయనే అంశాలు తెలుసుకోవడంపై పలు చిత్ర పరిశ్రమలు దృష్టి పెట్టాయి. ఇటీవల కర్ణాటక ఫిల్మ్‌ ఛాంబర్‌ (Sandal wood) ఆ పరిశ్రమకు చెందిన తారలతో మీటింగ్‌ నిర్వహించింది. ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు ఎన్‌.ఎం.సురేశ్‌ ఆధ్వర్యలో మీటింగ్‌ జరిగింది.

ఆయన మాట్లాడుతూ.. ‘‘కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్‌ ఆదేశాల మేరకు మేము ఈ మీటింగ్‌ ఏర్పాటు చేశాం. ఇండస్ట్రీలో మహిళలకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది తెలుసుకుని వారి సంరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలని అనేది ఈ మీటింగ్‌లో చర్చించనున్నాం’’ అని అన్నారు. ఏడు సంవత్సరాలు శ్రమించి జస్టిస్‌ హేమ కమిటీ ఈ రిపోర్ట్‌ రెడీ చేసింది. మలయాళ సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వర్కింగ్‌ కంచిడీషన్లు, రెమ్యూనరేషన్‌, సాంకేతిక రంగంలో మహిళల భాగస్వామ్యం తదితర అంశాలను అధ్యయనం చేసింది. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు పడుతున్న ఇబ్బందుల గురించి అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ హేమ కమిటీ రిపోర్ట్‌ ప్రతి ఇండస్ట్రీలోనూ హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ కమిటీ ఇచ్చిన ధైర్యంతో పలువురు అగ్ర నటీమణులు సైతం తమకు జరిగిన లైంగిక వేధింపుల గురించి తెలియజేసేందుకు ముందుకు వస్తున్నారు.

Also Read- Sai Durgha Tej: మేనమామల దారిలో సాయి దుర్గ తేజ్.. తగ్గేదేలే

Also Read- Prakash Raj: గుడికెళ్లిన ప్రకాష్ రాజ్.. ఫ్యాన్స్ ఫైర్

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 30 , 2024 | 09:59 AM