సంచారి సంచారి... ఎటువైపో నీ దారి
ABN , Publish Date - Dec 03 , 2024 | 06:19 AM
మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. డిసెంబరు 20న థియేటర్లలో...
మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. డిసెంబరు 20న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రంలోని రెండో పాట ‘సంచారి సంచారి.. ఎటువైపో నీ దారి’ని మేకర్స్ విడుదల చేశారు. ఈ గీతాన్ని రామజోగయ్య శాస్త్రి రాయగా, సంజిత్ హేగ్డే ఆలపించారు. వివేక్ సాగర్ స్వరపరిచారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ ‘ఎటువంటి కథలోనైనా భావోద్వేగం లేకపోతే ఆ కథకు పరిపూర్ణత ఉండదు. ఈ సినిమాలో ప్రధానమైన అంశం ప్రేమ. తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి, తన నమ్మకానికి మధ్య నలిగిపోయిన వ్యక్తి కథే ‘సారంగపాణి జాతకం’ అని అన్నారు. ఈ చిత్రంలో నరేశ్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిశోర్, వైవా హర్ష తదితరులు కీలక పాత్రల్లో నటించారు.