ఈ డైరెక్టర్ గుర్తున్నాడా.. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాతో వస్తున్నాడు

ABN , Publish Date - Oct 02 , 2024 | 11:06 PM

ఒకప్పుడు వరుస హిట్స్‌తో ఇండస్ట్రీలో పేరు మారుమోగిన దర్శకుడు కొన్నాళ్లుగా సైలెంట్‌గానే ఉంటున్నాడు. మళ్లీ ఇన్నాళ్లకు పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఆ దర్శకుడు, ఆ పాన్ ఇండియా వివరాలేంటో చూద్దామా..

VN Aditya New Film Announcement

‘మనసంతా నువ్వే, నేనున్నాను, బాస్, ఆట’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులని అలరించిన టాలెంటెడ్ డైరెక్టర్ వీఎన్ ఆదిత్య (VN Aditya). వరుస ప్లాప్‌లతో సతమతవుతున్న ఈ డైరెక్టర్ కాస్త గ్యాప్ తర్వాత పాన్ ఇండియా మూవీతో వస్తున్నట్లు అనౌన్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. తాజాగా ఈ సినిమా పోస్టర్‌ని అమెరికాలో ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ప్రొడ్యూసర్ అనిల్ సుంకర (Anil Sunkara)తో పాటు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) పూర్వాధ్యక్షులు డాక్టర్ తోటకూర ప్రసాద్ ప్రధాన అతిధులుగా హాజరయ్యారు.

Also Read- Samantha: కొండా సురేఖ కాంట్రవర్సీ వ్యాఖ్యలపై సమంత స్ట్రాంగ్ కౌంటర్

మ్యూజిక్ డైరెక్టర్ డాక్టర్ మీనాక్షి ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తుండటంతో పాటుగా నిర్మాతగా అవతారమెత్తారు. ఆమె ప్రొడక్షన్ హౌజ్ ఓఎంజీ (OMG Productions) బ్యానర్ లోగోని నిర్మాత అనిల్ సుంకర విడుదల చేశారు. అనంతరం తోటకూర ప్రసాద్ ఈ మూవీ టైటిల్ ‘ఫణి’ (Phani)ని లాంచ్ చేశారు. కేథ‌రిన్ థ్రెసా (Catherine Tresa) లీడ్‌గా ఈ సినిమాని లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్‌గా తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ టైమ్ ఛాలెంజింగ్ రోల్ యాక్ట్ చేస్తున్నందుకు సంతోషంగా ఉందని కేథ‌రిన్ డైరెక్టర్ ఆదిత్యకి థ్యాంక్స్ చెప్పారు. కేథ‌రిన్‌తో పాటు ఈ మూవీలో మహేష్ శ్రీరామ్, నేహా కృష్ణ, తనికెళ్ల భరణి(Tanikella Bharani), కాశీ విశ్వనాథ్( Kashi Vishwanath), రంజిత, యోగిత, ప్రశాంతి హారతి, సాన్య, ఆకాష్, అనిల్ శంకరమంచి, కిరణ్ గుడిపల్లి, బాల కర్రి, దయాకర్, తదితరులు నటిస్తున్నారు.


మూవీ పోస్టర్‌లో చూపించినట్లు ఫణి అంటే హిందీలో పాము అని అర్థం. దీనితో ఈ మూవీ కథ స్నేక్ చుట్టూ తిరుగుతుందా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. రిలీజైన పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో డైరెక్ట్‌గా విడుదల చేయనున్నారు.

Also Read- King Nagarjuna: వెనక్కి తీసుకోండి.. కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలపై నాగార్జున

Also Read- Pawan Kalyan: తిరుమలలో పవన్ క‌ల్యాణ్‌ చిన్న‌ కుమార్తె.. డిక్లరేషన్ ఇచ్చి దైవ ద‌ర్శనానికి

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 02 , 2024 | 11:06 PM