Vishva Karthikeya: బర్త్‌డే స్పెషల్‌గా బాలయ్య ఫ్యాన్ అవతార్‌లో..

ABN , Publish Date - Jul 03 , 2024 | 10:24 PM

విశ్వ కార్తికేయ తన పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకుంటూ.. తన తదుపరి సినిమాల అప్‌డేట్‌ని తెలిపారు. ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి అమరావతి టూరింగ్ టాకీస్ ప్రొడక్షన్ నెం. 1గా రూపుదిద్దుకుంటోన్న చిత్రం. ఈ చిత్ర కాన్సెప్ట్ పోస్టర్‌ని తాజాగా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో జై బాలయ్య స్లోగన్ చూస్తుంటే.. ఇందులో ఆయన బాలయ్య ఫ్యాన్‌గా కనిపించబోతున్నారనేది తెలుస్తోంది.

Vishva Karthikeya New Film Update

బాలనటుడిగా కెరీర్ మొదలు పెట్టి.. ఇప్పుడు హీరోగా బిజీ అయ్యారు హీరో విశ్వ కార్తికేయ (Vishva Karthikeya). ‘కలియుగం పట్టణంలో’ అనే సినిమాతో నటుడిగా అందరినీ ఆకట్టుకున్న విశ్వ కార్తికేయ.. ప్రస్తుతం పలు ప్రాజెక్టు‌లతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన తన పుట్టిన రోజును (HBD Vishva Karthikeya) గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకుంటూ.. తన తదుపరి సినిమాల అప్‌డేట్‌ని తెలిపారు. విశ్వ కార్తికేయ ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి అమరావతి టూరింగ్ టాకీస్ ప్రొడక్షన్ నెం. 1గా రూపుదిద్దుకుంటోన్న చిత్రం.

ఈ సినిమాలో విశ్వ కార్తికేయ బాలయ్య ఫ్యాన్‌గా (Balayya Fan) ఆడియెన్స్‌ను అలరించనున్నారు. ఆద్యంతం వినోదభరితంగా ఉండే ఈ సినిమాలో విశ్వ కార్తికేయ పాత్ర ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉండబోతోందని.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని.. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలను ప్రకటించనున్నామని మేకర్స్ తెలిపారు. అంతేకాదు, విశ్వ కార్తికేయ బర్త్ డే సందర్భంగా ఈ చిత్ర కాన్సెప్ట్ పోస్టర్‌ని కూడా వదిలారు. ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది.


Vishva-Karthikeya.jpg

దునియాలా జిందగీ జిలేబి లెక్కుండాలే చిచ్చా అనే మాటలు, యాస చూస్తుంటే ఇందులో విశ్వ కార్తికేయ పక్కా మాస్ పాత్రను పోషించబోతోన్నారనేది అర్థమవుతోంది. ఇక ఆ షర్ట్, ఆ డిజైన్ చూస్తుంటే ఎంత మాసీగా ఉండబోతోన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘జై బాలయ్య’ అనే స్లోగన్‌ను కూడా పెట్టేసి ఈ చిత్రంలో హీరో విశ్వ కార్తికేయ బాలయ్య ఫ్యాన్‌గా కనిపిస్తారనే హింట్ ఇచ్చేశారు. ప్రస్తుతం విశ్వ కార్తికేయ ఇండోనేషియా ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు.

Updated Date - Jul 03 , 2024 | 10:24 PM