Vikram's New Movie : కొత్త కబురు
ABN , Publish Date - Dec 14 , 2024 | 06:35 AM
తమిళ హీరో విక్రమ్ నటిస్తున్న కొత్త చిత్రం ఖరారైంది. శాంతి పిక్చర్స్ సంస్థ అధినేత అరుణ్ విశ్వ నిర్మించే ఈ చిత్రానికి మడోన్ అశ్విన్ దర్శకుడు. కొత్త తరహా కథాంశంతో రూపుదిద్దుకొనే ఈ చిత్రంలో విక్రమ్ పాత్ర వినూత్నంగా
తమిళ హీరో విక్రమ్ నటిస్తున్న కొత్త చిత్రం ఖరారైంది. శాంతి పిక్చర్స్ సంస్థ అధినేత అరుణ్ విశ్వ నిర్మించే ఈ చిత్రానికి మడోన్ అశ్విన్ దర్శకుడు. కొత్త తరహా కథాంశంతో రూపుదిద్దుకొనే ఈ చిత్రంలో విక్రమ్ పాత్ర వినూత్నంగా ఉండబోతోందని దర్శకుడు అశ్విన్ చెప్పారు. ఈ సందర్భంగా నిర్మాత అరుణ్ మాట్లాడుతూ ‘హీరోగా విక్రమ్ ప్రయాణం ఎంతో మందికి స్పూర్తినిస్తుంది. ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన ఆయనతో సినిమా తీయడం ఆనందంగా ఉంది. అలాగే ‘మండేలా’, ‘మా వీరన్’ చిత్రాల దర్శకుడు అశ్విన్‌తో కలసి మరో సారి పని చేస్తున్నాం. త్వరలో షూటింగ్ ప్రారంభమవుతుంది’ అని చెప్పారు.