Vijayashanti: పవర్ ఫుల్ పోలీసాఫీసరుగా మళ్ళీ విజయశాంతి

ABN , Publish Date - Jun 24 , 2024 | 11:39 AM

'కర్తవ్యం' సినిమాలో పోలీసాఫీసర్ వైజయంతిగా విజయశాంతి నటవిశ్వరూపం చూస్తారు. ఆ సినిమాకి ఆమెకి జాతీయ అవార్డు కూడా వచ్చింది. చాలా సంవత్సరాల తరువాత మళ్ళీ నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాలో విజయశాంతి పోలీసాఫీసర్ వైజయంతిగా కనపదానున్నారు. ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా సినిమా నుండి ఆమె లుక్ ని విడుదల చేశారు.

Vijayashanti: పవర్ ఫుల్ పోలీసాఫీసరుగా మళ్ళీ విజయశాంతి
Vijayashanthi as IPS Officer Vyjayanthi

తెలుగులో 'కర్త్యవ్యం' సినిమా లో ఒక పవర్ ఫుల్ పోలీసాఫిసారుగా నటించిన విజయశాంతి ఆ తరువాత లేడీ అమితాబ్ గా పేరుపొందారు. అలాగే లేడీ సూపర్ స్టార్ అని కూడా అంటారు. 'కర్త్యవం' తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక చరిత్ర సృష్టించింది, అందులో నటించిన విజయశాంతి ఆ సినిమాతో సూపర్ స్టార్ అయ్యారు. పోలీసు పాత్రలో అప్పటి వరకు ఒక్క నటి కూడా అంత పవర్ ఫుల్ గా నటించలేదు, కానీ విజయశాంతి నటించి చూపించారు.

ఆ సినిమా అప్పట్లో చాలా ప్రభావాన్ని చూపించింది ప్రేక్షకుల్లో, సమాజంలో, అలాగే ఎందరికో స్ఫూర్తిని ఇచ్చింది కూడా. ఆ సినిమాలో వైజయంతి పాత్రలో నటించి, ఆ పాత్రలో మమేకమైన విజయశాంతికి జాతీయ అవార్డు వచ్చింది. ఆ సినిమా తరువాత తమిళం, మలయాళం, హిందీ భాషల్లో కూడా విడుదలై విజయఢంకా మోగించింది.

vijayashanthilook.jpg

ఇప్పుడు చాలా సంవత్సరాల తరువాత విజయశాంతి మళ్ళీ ఒక పోలీసాఫీసరు గా కనపడనున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న 21వ సినిమా నుండి విజయశాంతి పుట్టినరోజు సందర్భంగా ఆమె లుక్ ని ఈరోజు విడుదల చేశారు. ఆసక్తికరం ఏంటంటే ఈ సినిమాలో కూడా ఆమె పాత్ర పేరు వైజయంతి అవటం. ఈ సినిమాకి ప్రదీప్ చిలుకూరి దర్శకుడు, అశోక్ వర్ధన్ ముప్ప, సునీల్ బులుసు నిర్మాతలు. అలాగే ఈ సినిమా నుండి విజయశాంతి ప్రచార వీడియోని కూడా విడుదల చేశారు.

ఆ వీడియోలో నందమూరి కళ్యాణ్ రామ్ వాయిస్ ఓవర్ చెప్పారు. "విజయశాంతి ఐపీఎస్, తను పట్టుకుంటే పోలీస్ తుపాకీకె ధైర్యం వస్తుంది, వేసుకుంటే యూనిఫామ్ కె ప్రేమోషన్ వస్తుంది. తనే ఒక యుద్ధం, నేనే తన సైన్యం" అనే ఒక పవర్ ఫుల్ డైలాగు చెప్పారు కళ్యాణ్ రామ్.

Updated Date - Jun 24 , 2024 | 11:39 AM