మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Family Star: విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ టీజర్‌ రిలీజ్‌కు డేట్, టైమ్ ఫిక్స్

ABN , Publish Date - Mar 03 , 2024 | 09:48 PM

హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా టీజర్ రిలీజ్ డేట్ అండ్ టైమ్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమా టీజర్‌ను మార్చి 4న సోమవారం సాయంత్రం 6:30 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. ‘ఫ్యామిలీ స్టార్’ టీజర్ రిలీజ్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ సరసన ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Family Star: విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ టీజర్‌ రిలీజ్‌కు డేట్, టైమ్ ఫిక్స్
Vijay Deverakonda in Family Star

హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) సినిమా టీజర్ రిలీజ్ డేట్ అండ్ టైమ్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమా టీజర్‌ను మార్చి 4న సోమవారం సాయంత్రం 6:30 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. ‘ఫ్యామిలీ స్టార్’ టీజర్ రిలీజ్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ సరసన ఇందులో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను టాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హోల్ సమ్ ఎంటర్‌టైనింగ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల (Parasuram Petla) రూపొందిస్తున్నారు. (Family Star Movie Teaser Release Date Out)


Vijay.jpg

‘ఫ్యామిలీ స్టార్’ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వాసు వర్మ (Varu Varma) వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు. మరో నెల రోజుల టైమ్ మాత్రమే ఉండటంతో ప్రమోషన్ యాక్టివిటీస్ స్పీడప్ చేసింది మూవీ టీమ్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్, పోస్టర్స్, నందనందనా లిరికల్ సాంగ్.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా కచ్చితంగా సూపర్ హిట్ కానుందనే ఇండికేషన్స్ అప్పుడే ఇండస్ట్రీ వర్గాల్లో కనిపిస్తున్నాయంటే.. మేకర్స్ ఎంత నమ్మకంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక టీజర్ తర్వాత ఈ ‘ఫ్యామిలీ స్టార్’పై మరింతగా అంచనాలు పెరగడం ఖాయమని యూనిట్ చెబుతోంది. (Family Star Movie)


ఇవి కూడా చదవండి:

====================

*Save The Tigers 2: ‘సేవ్ ద టైగర్స్ 2’ ట్రైలర్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..

***************************

*Charan and Upasana: భార్య కాళ్లకు మసాజ్ చేస్తున్న రామ్ చరణ్.. వీడియో వైరల్

************************

*Tarak and Charan: రామ్-భీమ్ కలిసి ఒకే కారులో.. వీడియో వైరల్

********************

*Jr NTR: ఒకే ఫ్రేమ్‌లో ఎన్టీఆర్, రిషభ్ శెట్టి, ప్రశాంత్ నీల్.. ఏంటి కథ?

**************************

Updated Date - Mar 03 , 2024 | 09:48 PM