సంక్రాంతికే వస్తున్నాం

ABN , Publish Date - Nov 21 , 2024 | 06:28 AM

విక్టరీ వెంకటేశ్‌, దర్శకుడు అనిల్‌రావిపూడి కలయికలో తెరకెక్కుతున్న మూడో సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. మీనాక్షీ చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌ నటిస్తున్నారు. దిల్‌రాజు,

విక్టరీ వెంకటేశ్‌, దర్శకుడు అనిల్‌రావిపూడి కలయికలో తెరకెక్కుతున్న మూడో సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. మీనాక్షీ చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌ నటిస్తున్నారు. దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 14న విడుదల కానున్నట్లు మేకర్స్‌ బుధవారం ప్రకటించారు. ఈ సందర్భంగా వెంకటేశ్‌ మాట్లాడుతూ ‘‘ఈ సంక్రాంతికి ఒక మంచి వినోదాత్మక చిత్రాన్ని ప్రేక్షకులకు అందివ్వాలనే లక్ష్యంతో సినిమాను అద్భుతంగా తెరకెక్కించాం. నా కెరీర్‌లో నేను నటించిన ఉత్తమ కుటుంబ కథా చిత్రమిదే. అందరికీ నచ్చుతుంది. సంక్రాంతికి విడుదలవుతున్న అన్ని సినిమాలు ఘనవిజయం సాధించాలి. అనిల్‌తో పనిచేయడం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది’’ అని చెప్పారు. ‘‘తను అనుకున్న కథని తెరపైకి అద్భుతంగా తీసుకొచ్చే దర్శకుడు అనిల్‌ రావిపూడి. గతంలో నేను నిర్మించిన ఎన్నో చిత్రాలు సంక్రాంతికి విడుదలై ఘనవిజయం సాధించాయి. ఈ సినిమా వాటికంటే పెద్ద విజయం సాధించాలి’’ అని నిర్మాత దిల్‌రాజు తెలిపారు. ‘‘ఒక మాజీ పోలీసు.. మాజీ ప్రేయసి.. అద్భుతమైన భార్య మధ్య జరిగే అందమైన ప్రమాణం ఈ సినిమా. క్రైమ్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమా సరికొత్త థ్రిల్‌ను పంచుతుంది. ఈ సినిమాలోని పాత్రలు అందరికీ చిరకాలం గుర్తిండిపోతాయి’’ అని దర్శకుడు అనిల్‌ రావిపూడి అన్నారు.

Updated Date - Nov 21 , 2024 | 06:28 AM