O Manchi Ghost: ‘ఓ మంచి ఘోస్ట్’ వచ్చేది ఎప్పుడంటే..

ABN , Publish Date - Jun 13 , 2024 | 03:24 PM

వెన్నెల కిషోర్, నందితా శ్వేత ప్రధాన పాత్ర‌ల్లో నటించిన చిత్రం ‘ఓ మంచి ఘోస్ట్’. ఈ మధ్య హారర్, కామెడీ చిత్రాలను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తున్నారో తెలిసిందే. థియేటర్లలోనే కాకుండా.. ఓటీటీలోనూ ఈ జానర్‌ సినిమాలు మంచి స్పందనను రాబట్టుకుంటున్నాయి. ఇప్పుడీ సినిమా కూడా అదే జానర్‌లో రాబోతోంది. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్‌ని లాక్ చేసినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

O Manchi Ghost: ‘ఓ మంచి ఘోస్ట్’ వచ్చేది ఎప్పుడంటే..

వెన్నెల కిషోర్ (Vennela Kishore, నందితా శ్వేత (Nandita Swetha) ప్రధాన పాత్ర‌ల్లో నటించిన చిత్రం ‘ఓ మంచి ఘోస్ట్’ (O Manchi Ghost). ఈ మధ్య హారర్, కామెడీ చిత్రాలను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తున్నారో తెలిసిందే. థియేటర్లలోనే కాకుండా.. ఓటీటీలోనూ ఈ జానర్‌ సినిమాలు మంచి స్పందనను రాబట్టుకుంటున్నాయి. ఇప్పుడీ సినిమా కూడా అదే జానర్‌లో రాబోతోంది. కామెడీ స్పెషలిస్ట్ వెన్నెల కిషోర్, హారర్ స్పెషలిస్ట్ నందితా శ్వేత కలిసి నటిస్తోన్న ఈ సినిమా మొదటి నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సూపర్ కాంబినేషన్‌‌‌లో ‘ఓ మంచి ఘోస్ట్’ సినిమాను జూన్ 21న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. (O Manchi Ghost Release Date)

Also Read- Mega vs Allu: మరోసారి రివీలైన మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య యుద్ధం

మార్క్‌సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్‌పై శంకర్ మార్తాండ్ (Shankar Marthand) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ‘ఓ మంచి ఘోస్ట్’ చిత్రంలో షకలక శంకర్, నవమి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్, హాస్యనటుడు రఘుబాబు తదితరులు ఇతర పాత్రలలో నటించారు. డా. అబినికా ఇనాబతుని నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపొందగా.. అనూప్ రూబెన్స్ (Anup Rubens) మ్యూజిక్ అందించారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్, లిరికల్ సాంగ్‌, టీజర్‌లు మంచి స్పందనను రాబట్టుకోవడంతో.. చిత్ర విజయంపై టీమ్ అంతా ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.


OMG.jpg

ఈ దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ఎన్నో హిట్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు మంచి ఆర్ఆర్, పాటలు ఇచ్చారు. ఈ చిత్రానికి అనూప్ మ్యూజిక్ హైలెట్ కానుంది. సినిమా అంతా కూడా నవ్విస్తూ, భయపెట్టిస్తూ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసేలా ఉంటుంది. ఇక థియేటర్లో చాలా రోజుల తరువాత వెన్నెల కిషోర్ తన నటనతో అందరినీ అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమాకు ప్రతి ఒక్కరూ ఎంతగానో సపోర్ట్ ఇచ్చారు. జూన్ 21న ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నాం’’ అని తెలిపారు. (O Manchi Ghost Movie)

Read Latest Cinema News

Updated Date - Jun 13 , 2024 | 03:24 PM