Tollywood Hero: ఈ ఫొటోలో ఉన్నది ఎవరో గుర్తు పట్టారా? టాలీవుడ్‌లోని ఓ యంగ్ హీరో?

ABN , Publish Date - Jul 11 , 2024 | 04:23 PM

ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి ఎవరో గుర్తు పట్టారా? సరిగ్గా చూస్తే గానీ ఎవరో చెప్పలేరు. ఏంటి ఇంకా గుర్తు పట్టలేదా? క్లూ ఇమ్మంటారా? టాలీవుడ్‌లో తెలంగాణ నేపథ్యం ఉన్న ఓ యంగ్ హీరో. ఇంకా గుర్తు పట్టలేదా? అయితే మరో క్లూ. ఈ హీరోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి. పవన్ కళ్యాణ్‌కి కూడా ఈ హీరో అంటే చాలా ఇష్టం. ఇప్పుడర్థమైందా? గుర్తు పట్టేస్తే ఓకే.

Robinhood Hero

ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి ఎవరో గుర్తు పట్టారా? సరిగ్గా చూస్తే గానీ ఎవరో చెప్పలేరు. ఏంటి ఇంకా గుర్తు పట్టలేదా? క్లూ ఇమ్మంటారా? టాలీవుడ్‌లో తెలంగాణ నేపథ్యం ఉన్న ఓ యంగ్ హీరో. ఇంకా గుర్తు పట్టలేదా? అయితే మరో క్లూ. ఈ హీరోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి. పవన్ కళ్యాణ్‌కి కూడా ఈ హీరో అంటే చాలా ఇష్టం. ఇప్పుడర్థమైందా? గుర్తు పట్టేస్తే ఓకే. పట్టని వారి కోసం ఆ హీరో ఎవరో చెబుతున్నాం.. షాక్ కావద్దు. ని.. ని.. నితిన్. అవును మీరు ఈ ఫొటోలో చూస్తున్న ఏజ్‌డ్ పర్సన్ నితిన్. ప్రస్తుతం ఆయన చేస్తున్న ఓ సినిమా కోసం ఇలా ఓ సన్నివేశంలో కనిపించబోతున్నారు నితిన్.

Also Read-AM Rathnam Family: సంతోషంలో నిర్మాత ఏఎమ్ రత్నం ఫ్యామిలీ.. విశేషమిదే!


నితిన్ (Nithiin) ఒక్కడే కాదు.. పక్కన ఏజ్‌డ్ శ్రీలీల (Sreeleela)ను కూడా చూడొచ్చు. కారులో కూర్చుని మేకప్ సరిచేసుకుంటున్న శ్రీలీలను చూడగానే గుర్తుపట్టేలానే ఉంది కానీ.. నితిన్ మాత్రం అసలు పోల్చుకోలేని విధంగా ఉండటం విశేషం. ఇకపోతే.. వీరిద్దరూ ఈ అవతార్‌లో ఉన్న వీడియోను స్వయంగా చిత్ర దర్శకుడే షేర్ చేయడం గమనార్హం. ఆ దర్శకుడు ఎవరో కాదు వెంకీ కుడుముల. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా నటిస్తోన్న చిత్రం ‘రాబిన్‌హుడ్’ (Robinhood). ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది.


Nithiin-Robinhood.jpg

ఇందులో ఓ సన్నివేశంలో నితిన్, శ్రీలీల కాస్త ఏజ్‌డ్ లుక్‌లో కనిపించనున్నారు. ఆ సన్నివేశాన్ని చిత్రీకరణ జరిపే క్రమంలో.. వెంకీ కుడుముల (Venky Kudumula) షూటింగ్ స్పాట్‌ నుంచి ఓ వీడియోని చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యున్నత స్థాయి ప్రొడక్షన్, టెక్నికల్ వాల్యూస్‌తో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రానికి నిర్మాతలు. ‘రాబిన్‌హుడ్’ చిత్రాన్ని క్రిస్మస్ స్పెషల్‌గా డిసెంబర్ 20న విడుదల చేయనున్నారు.

Read Latest Cinema News

Updated Date - Jul 11 , 2024 | 04:30 PM

Robinhood: నితిన్ ‘రాబిన్‌హుడ్’ నుంచి కీలక అప్‌డేట్

Robinhood: ‘రాబిన్‌హుడ్’.. నితిన్ బర్త్‌డే స్పెషల్ గ్లింప్స్

Robinhood: క్రిస్మ‌స్‌కు.. నితిన్ రాబిన్‌హుడ్

Robin Hood: ఆస్తులున్నవాళ్లంతా నా అన్నదమ్ముళ్లు.. నితిన్ ,వెంకీ కుడుముల కొత్త చిత్రం ‘రాబిన్‌హుడ్‌’

Robinhood: నితిన్, వెంకీ కుడుముల సినిమాలో శ్రీలీలకు బదులు రాశి ఖన్నా