Venkatalakshmi Tho Yaadadhi Kindata: ‘వెంకటలక్ష్మితో యాడాది కిందట’ టైటిల్ పోస్టర్ విడుదల

ABN , Publish Date - Sep 01 , 2024 | 04:23 PM

టింట్ స్ప్రీ స్టూడియోస్ బ్యానర్‌‌పై ఆలేటి రాజేష్ నిర్మాతగా రామమూర్తి కొట్టాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రేమ కథా చిత్రం ‘వెంకటలక్ష్మితో’. ‘యాడాది కిందట’ అనే ట్యాగ్‌లైన్‌. రఘు గద్వాల్, ప్రియాంక శ్రీ, శివ ప్రసన్న హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ టైటిల్ పోస్టర్‌‌ను హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.

Venkatalakshmi Tho Title Poster Launch Event

టింట్ స్ప్రీ స్టూడియోస్ బ్యానర్‌‌పై ఆలేటి రాజేష్ నిర్మాతగా రామమూర్తి కొట్టాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రేమ కథా చిత్రం ‘వెంకటలక్ష్మితో’ (Venkatalakshmi Tho). ‘యాడాది కిందట’ (Yaadadhi Kindata) అనే ట్యాగ్‌లైన్‌. రఘు గద్వాల్, ప్రియాంక శ్రీ, శివ ప్రసన్న హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ టైటిల్ పోస్టర్‌‌ను హీరో శ్రీకాంత్ (Hero Srikanth) చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. టైటిల్ పోస్టర్ విడుదల అనంతరం హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. టైటిల్ చాలా బాగుంది. క్యాచీగా ఉంది. యంగ్ టీమ్ చేసిన సినిమా ఇది. షార్ట్ ఫిలింస్‌తో ఫేమస్ అయిన హీరో రఘు ఈ సినిమా ద్వారా అందర్నీ ఆకట్టుకుంటాడని నమ్ముతున్నా. కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఇది కూడా ఓ కొత్త కంటెంట్‌తో రాబోతోందని అర్ధమవుతోంది. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ అని చెప్పారు. (Venkatalakshmi Tho Yaadadhi Kindata Title Poster Launched)

చిత్ర హీరో రఘు గద్వాల మాట్లాడుతూ.. నూతన నటీనటులతో ఏడాది కిందట ఈ చిత్రాన్ని ప్రారంభించాం. ప్రమోషన్స్‌లో భాగంగా మొట్టమొదట మాకు హీరో శ్రీకాంత్‌గారు సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. శ్రీకాంత్ గారికి మా టీమ్ తరపున స్పెషల్ థాంక్స్ అని తెలపగా.. నిర్మాత ఆలేటి రాజేష్ మాట్లాడుతూ.. సంవత్సరం కిందట ఈ సినిమాను స్టార్ట్ చేసి షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేశాం. దర్శకుడితో సహా అంతా కొత్త వారితో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. మా టైటిల్ పోస్టర్ లాంచ్ చేసిన శ్రీకాంత్ గారికి ధన్యవాదాలని అన్నారు.


venkatalakshmi-tho.jpg

చిత్ర దర్శకుడు రామమూర్తి కొట్టాల మాట్లాడుతూ.. మా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా టైటిల్ పోస్టర్‌‌ను హీరో శ్రీకాంత్ లాంచ్ చేయడం సంతోషంగా ఉంది. ఇదొక స్వచ్ఛమైన ప్రేమ కథా చిత్రం. థ్రిల్లర్, సస్పెన్స్‌తో పాటు అన్ని ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాం. అంతా కొత్త వారితో తీసిన ఈ సినిమా ప్రేక్షకులకు చాలా ఫ్రెష్ ఫీల్‌ని ఇస్తుంది. నిర్మాత రాజేష్ బాగా సపోర్ట్ చేశారు. కంటెంట్ ఉన్న చిత్రాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నానని తెలిపారు.

Updated Date - Sep 01 , 2024 | 04:23 PM