Fear: వేదిక ‘ఫియర్’ విశేషమేమిటంటే..

ABN , Publish Date - Feb 18 , 2024 | 05:34 PM

దత్తాత్రేయ మీడియా బ్యానర్‌పై దర్శకురాలు హరిత గోగినేని దర్శకత్వంలో.. ప్రొడ్యూసర్ ఏఆర్ అభి నిర్మిస్తున్న చిత్రం ‘ఫియర్’. హీరోయిన్ వేదిక లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాకు సుజాత రెడ్డి మరియు సామ సురేందర్ రెడ్డి కో ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్‌లో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లుగా మేకర్స్ తెలిపారు.

Fear: వేదిక ‘ఫియర్’ విశేషమేమిటంటే..
Fear Movie Still

దత్తాత్రేయ మీడియా బ్యానర్‌పై దర్శకురాలు హరిత గోగినేని దర్శకత్వంలో.. ప్రొడ్యూసర్ ఏఆర్ అభి నిర్మిస్తున్న చిత్రం ‘ఫియర్’. హీరోయిన్ వేదిక లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాకు సుజాత రెడ్డి మరియు సామ సురేందర్ రెడ్డి కో ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు. సస్పెన్స్, థ్రిల్లర్ కథతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్‌లో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి మేకర్స్ అప్‌డేట్ ఇచ్చారు. ‘ఫియర్’ షూటింగ్ పూర్తయినట్లుగా మేకర్స్ వెల్లడించారు.

చిత్రీకరణ పూర్తైన సందర్భంగా ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టారు. షూటింగ్ ప్రారంభించుకుని సింగిల్ షెడ్యూల్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకోవడం విశేషం. డైరెక్టర్‌గా మొదటి సినిమా అయినప్పటికీ.. హరిత గోగినేని ఎంతో క్లారిటీతో ‘ఫియర్’ సినిమాను చిత్రీకరించారు. వేదిక కోపరేషన్, ఇతర ఆర్టిస్టుల సపోర్ట్, మూవీ టీమ్ పక్కా ప్లానింగ్ అన్నీ సెట్టయ్యాయి కాబట్టే ఇంత తక్కువ టైమ్‌లో షూటింగ్ కంప్లీట్ చేయగలిగారు.


Vedhika-2.jpg

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలైనట్లుగా దర్శకనిర్మాతలు తెలుపుతున్నారు. సినిమా ఔట్ పుట్ అద్భుతంగా వచ్చిందని, త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి.. సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామని వారు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి:

====================

*‘ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో..’ ఆడియో క్యాసెట్‌ కోసం పుట్టిన పాటని తెలుసా?

**************************

*Allu Arjun: 1, 2, 3.. పుష్ప కథను కొనసాగించాలనుకుంటున్నాం..

****************************

*Chiranjeevi: నా జీవన రేఖ.. భార్య సురేఖకు చిరు బర్త్‌డే విశెస్

*****************************

Updated Date - Feb 18 , 2024 | 05:34 PM