Varun Sandesh: ఈసారి ‘కానిస్టేబుల్’గా వరుణ్ సందేశ్
ABN , Publish Date - Dec 05 , 2024 | 09:15 AM
ఈ మధ్య కంటెంట్ ప్రధానమైన చిత్రాలలో నటిస్తూ.. ప్రేక్షకుల మెప్పును అందుకుంటున్న వరుణ్ సందేశ్ మరో వైవిధ్యభరిత చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన న్యూ పోస్టర్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
‘హ్యాపీ డేస్’ ఫేమ్ వరుణ్ సందేశ్ కొంత గ్యాప్ తర్వాత ఈ మధ్య కాలంలో మంచి కంటెంట్ చిత్రాలతో ప్రేక్షకులకు ముందు వస్తూ.. విజయాలను అందుకుంటున్నారు. ఇటీవల ఆయన నుండి వచ్చిన సినిమాలన్నీ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాయి. ఈ నేపథ్యంలో మరో కంటెంట్ బేస్డ్ సినిమాతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు ఆయన రెడీ అవుతున్నారు. వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ SK దర్శకత్వంలో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న చిత్రం ‘కానిస్టేబుల్’. ఈ చిత్ర న్యూ పోస్టర్‌ని తాజా మేకర్స్ వదిలారు.
Also Read- Pushpa 2 Review: అల్లు అర్జున్ 'పుష్ప -2' ఎలా ఉందంటే...
వరుణ్ సందేశ్‌కి జోడిగా మధులిక వారణాసి నటిస్తోంది. ఈ చిత్రంతో ఆమె ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది. ఈ సినిమా పోస్టర్‌ను నెల్లూరు టౌన్ హాల్‌లో కలెక్టర్ కె. కార్తీక్, సినిమా రచయిత యండమురి వీరేంద్ర నాథ్ మరియు కొంతమంది ప్రముఖుల చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత బలగం జగదీష్ మాట్లాడుతూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే విడుదలకు సంబంధించిన అప్డేట్ ఇస్తామని తెలిపారు.
దర్శకుడు ఆర్యన్ సుభాన్ SK మాట్లాడుతూ.. సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ చిత్రమిదని చెప్పగా చిత్రానికి సంబంధించిన పాటలు మరియు టీజర్ త్వరలో రిలీజ్ చేస్తామని తెలిపారు. దువ్వాసి మోహన్, సూర్య, రవి వర్మ, మురళీధర్ గౌడ్, బలగం జగదీష్, ప్రభావతి, కల్పలత, నిత్య శ్రీ, శ్రీ భవ్య తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం బాధ్యతలను ఆర్యన్ సుభాన్ SK నిర్వర్తిస్తున్నారు.