Varshini: వర్షిణిచే నెయిల్స్ N బియాండ్ ప్రారంభం
ABN , Publish Date - Aug 12 , 2024 | 08:18 PM
సెల్యూన్ రంగంలో ప్రముఖ సంస్థగా పేరు గాంచిన నేచురల్స్ అనుబంధ బ్రాండ్ గా నెయిల్స్ N బియాండ్ ప్రారంభమైంది. మహిళలకు అందం విషయంలో స్కిన్, హెయిర్ ఎంత ముఖ్యమో చేతి గోళ్లు కూడా అంతే ముఖ్యం.
సెల్యూన్ రంగంలో ప్రముఖ సంస్థగా పేరు గాంచిన నేచురల్స్ అనుబంధ బ్రాండ్ గా నెయిల్స్ N బియాండ్ ప్రారంభమైంది. మహిళలకు అందం విషయంలో స్కిన్, హెయిర్ ఎంత ముఖ్యమో చేతి గోళ్లు కూడా అంతే ముఖ్యం. నెయిల్ ఆర్ట్ విషయంలో మగువలు ఎంతో శ్రద్ధ కనబరుస్తారు. అలాంటి వాళ్ళందరి కోసం నెయిల్స్ N బియాండ్ ఎన్నో రకాల వైవిధ్యమైన నెయిల్ ఆర్ట్ ఉత్పత్తులను, నెయిల్ ఆర్ట్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.హైదరాబాద్ లో ఎంతో రద్దీగా ఉండే కూకట్ పల్లిలోని విశాలమైన నెక్సస్ మాల్ లో నూతన షోరూమ్ ను ఏర్పాటు చేశారు.
నటి, యాంకర్ వర్షిణి సౌందరాజన్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా నెయిల్ ఆర్ట్ ను వేసుకుని మురిసిపోయారు. అమ్మాయిలందరి ఫేవరేట్ గా నెయిల్స్ N బియాండ్ నిలుస్తుందని వర్షిణి చెప్పారు. తాను ఓ సారి అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఒక అమ్మాయి చేతిలో ప్లకార్డ్ పట్టుకుని యాచిస్తూ ఉందని, కానీ ఆ అమ్మాయి చేతి వేళ్ళకు కూడా నెయిల్ ఆర్ట్ ఉండడం చూసి ఆశ్చర్యపోయానని చెప్పింది. ప్రస్తుతం నెయిల్ ఆర్ట్ షాప్స్ ప్రతి గల్లీలోనూ ఉన్నాయని వర్షిణి అభిప్రాయపడ్డారు.