Vaibhavam: ‘పల్లె వీధుల్లోన’ పాటతో ‘వైభవం’

ABN , Publish Date - Sep 27 , 2024 | 07:42 PM

‘చిన్ననాటి జ్ఞాపకాలను, తల్లిదండ్రుల ప్రేమను, స్వచ్ఛమైన స్నేహాన్ని, పల్లె వైభవాన్ని’ తెలిపేలా పాట వస్తే వినాలని ఎవరికి మాత్రం ఉండదు.. అలాంటి పాటే ఇప్పుడు ‘వైభవం’ సినిమా నుంచి వచ్చింది. ఆహ్లాదకరమైన పల్లె వాతావరణంలో చిత్రీకరించిన ఈ పాట వివరాల్లోకి వెళితే..

Vaibhavam Movie Stills

రమాదేవి ప్రొడక్షన్స్ పతాకంపై నూతన తారాగణంతో తెరకెక్కుతున్న ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘వైభవం’ (Vaibhavam Movie). యువ దర్శకుడు సాత్విక్ (Sathvik) దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలోని ‘పల్లె వీధుల్లోన’ పాటను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. రుత్విక్ - ఇక్రా ఇద్రిసి జంటగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. (Vaibhavam Movie First Single)

‘‘అరెరే అరెరెరెరే

ఎన్నెన్నో సంగతులే గుర్తొస్తున్నా యే..

మదిలో దాగున్న

చిన్నప్పటి జ్ఞాపకాలు వరదైపొంగాయే

కాలం ననుముందుకు పొమ్మంటున్నా..

బాల్యం ఇటుచూడని బతిమాలిందే..

రేపటి ప్రశ్నలెన్ని ఎదురవుతున్నా..

నిన్నటి చిరునవ్వే కనిపిస్తుందే..

పల్లె వీధుల్లోన నేనేసిన ప్రతి అడుగు కాదా సంగీతం’’

Also Read- Devara Review: ‘దేవర’ మూవీ రివ్యూ


Vaibhaam-song.jpg

అంటూ సాగిన ఈ పాటను.. ‘చిన్ననాటి జ్ఞాపకాలను, తల్లిదండ్రుల ప్రేమను, స్వచ్ఛమైన స్నేహాన్ని, పల్లె వైభవాన్ని’ గుర్తుచేసేలా దర్శకుడు సాత్విక్ స్వయంగా సాహిత్యాన్ని, బాణీలను సమకూర్చగా... రితేష్ జి రావు ఆలపించారు. ఈ పాట చూస్తుంటే చక్కని పల్లె వాతావరణంలో చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. పాట విన్నవారంతా ఒక్కసారి బాల్యాన్ని తలచుకుంటున్నారంటే.. దర్శకుడు సాత్విక్ పెన్ పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. త్వరలోనే ఈ చిత్రం ఫస్ట్ కాపీ సిద్ధమవుతుందని, రానున్న రోజుల్లో మరిన్ని అప్‌డేట్స్‌ అందిస్తామ‌ని ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు తెలిపారు.

Also Read- Jani Master Case: షాకింగ్ ట్విస్ట్.. విచారణలో జానీ మాస్టర్ ఏం చెప్పారంటే..

Also Read- Harsha Sai: అసలెవరీ హర్షసాయి.. మరో మెగాస్టార్ అంటూ బిల్డప్ ఇచ్చిన వారంతా ఏమయ్యారు

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 27 , 2024 | 08:03 PM