Upasana: అయోధ్య బాల రాముడికి.. ఉపాసన కుటుంబం ప్రత్యేక పూజలు
ABN , Publish Date - Mar 11 , 2024 | 03:27 PM
అయోధ్య రామ మందిరాన్ని మెగా కోడలు ఉపాసన తన తాత డా. ప్రతాప రెడ్డితో కలిసి దర్శించుకున్నారు. ఈసందర్భంగా బాలరాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇటీవలే ప్రారంభమైన అయోధ్య రామ మందిరాన్ని(Ayodhya Ram Mandir) మెగా కోడలు, అపోలో హస్పిటల్స్ వైస్ ప్రెసిడెంట్, రామ్ చరణ్ (Ram Charan) తీమణి ఉపాసన (Upasana) దర్శించుకున్నారు.
తాత ప్రతాప రెడ్డి (Prathap C. Reddy), నానమ్మ , అమ్మలతో కలిసి నిన్న అయోధ్యకు వెళ్లిన వారు అక్కడ ఆ బాల రాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ ఫోటోలను ఉపపాసన తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇదిలాఉండగా ఆయోధ్య రామమందిరంలో జనవరి 26న ప్రారంభమై 48 రోజుల పాటు కొనసాగుతున్న రామరాగ్ సేవ (Ram Raag Sewa) నిన్నటితో (మార్చి 10)తో ముగియనుండంతో ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు అపోలో హస్పిటల్స్ చైర్మన్ డా.ప్రతాపరెడ్డి (Prathap C. Reddy) తన మనుమరాలు ఉపాసన, ఇతర కుటుంబ సభ్యులతో అక్కడికి కలిసి వెళ్లి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ రామరాగ్ సేవ (Ram Raag Sewa) కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి పేరెన్నికగన్న ప్రముఖులు, నటులు, డ్యాన్సర్స్, గాయకులు వైజయంతిమాల, హేమ మాలిని, అనురాధ పౌడ్వాల్, సురేష్ వాడ్కర్ వంటి వారు హజరయ్యారు.
ఈ కార్యక్రమాల అనంతరం ఉపాసన (Upasana) కుటుంబ సభ్యులు బాల రాముడికి పూజలు నిర్వహించారు. ఆపై ఆ కార్యక్రమాలకు సంబంధించినవి, అక్కడి పూజారులతో దిగిన ఫొటోలు, వీడియోలను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేస్తూ నా హృదయం నిండింది.. థ్యాంక్యూ అంటూ తన తాత ప్రతాపరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఇప్పుడు ఆ ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.
ఇదిలా ఉండగా.. ఆయోధ్య పరిసర ప్రాంత ప్రజలకు క్రిటికల్ కేర్ సేవలను అందించేందుకు అక్కడి ప్రభుత్వ సాయంతో ఓ అత్యాధునిక ఎమర్జెన్సీ కేరక సెంటర్‌ను తాత డా. ప్రతాపపెడ్డితో కలిసి ఉపాసన ప్రారంభించింది.