రాజీ కోసం ప్రయత్నించండి
ABN, Publish Date - Nov 16 , 2024 | 06:00 AM
తన భార్య ఆర్తి నుంచి విడాకులు కోరుతూ తమిళ హీరో జయం రవి దాఖలు చేసిన విడాకుల పిటిషన్ శుక్రవారం చెన్నై ఫ్యామిలీ కోర్టులో విచారణకు వచ్చింది. ఆ సమయంలో
చెన్నై కోర్టు సూచన
చెన్నై, (ఆంధ్రజ్యోతి) : తన భార్య ఆర్తి నుంచి విడాకులు కోరుతూ తమిళ హీరో జయం రవి దాఖలు చేసిన విడాకుల పిటిషన్ శుక్రవారం చెన్నై ఫ్యామిలీ కోర్టులో విచారణకు వచ్చింది. ఆ సమయంలో కోర్టుకు జయం రవి నేరుగా హాజరు కాగా, ఆర్తి మాత్రం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా అందుబాటులోకి వచ్చారు. ఇరుపక్షాల వాదనలు ఆలకించిన న్యాయస్థానం.. రాజీ కోసం మరోసారి ఇద్దరూ కలిసి మాట్లాడుకోవాలని, ఇందుకోసం మధ్యవర్తిత్వాన్ని ఆశ్రయించాలని సూచించింది. అంతేగాక కచ్చితంగా విడిపోవాలని నిర్ణయించుకుంటే అందుకు స్పష్టమైన కారణం చూపాలని పేర్కొంది.