గొప్ప సినిమాను ఇవ్వాలని చేసిన ప్రయత్నం

ABN , Publish Date - Oct 29 , 2024 | 02:01 AM

తమిళ నటుడు సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా ‘కంగువ’. బాబీ డియోల్‌, దిశాపటానీ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని కే.ఈ.జ్ఞానవేల్‌ రాజా, వంశీ, ప్రమోద్‌, నిర్మించారు. వచ్చే నెల 14న...

తమిళ నటుడు సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా ‘కంగువ’. బాబీ డియోల్‌, దిశాపటానీ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని కే.ఈ.జ్ఞానవేల్‌ రాజా, వంశీ, ప్రమోద్‌, నిర్మించారు. వచ్చే నెల 14న విడుదలవుతోందీ సినిమా. ఈ సందర్భంగా వైజాగ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో హీరో సూర్య మాటాడుతూ ‘‘కంగువ’ డబ్బు కోసం చేసింది కాదు. మీ అందరికీ ఒక గొప్ప సినిమాను ఇవ్వాలని చేసిన ప్రయత్నం. థియేటర్లలో అద్భుతమైన అనుభూతిని పంచే చిత్రమిది’’ అని చెప్పారు. ‘‘ప్రతీ దర్శకుడికి జీవితాంతం గుర్తుండిపోయేలా ఒక సినిమా తీయాలని ఉంటుంది. నాకు ‘కంగువ’ అలాంటిదే’’ అని దర్శకుడు శివ అన్నారు. ‘‘ఇలాంటి భారీ చిత్రాన్ని తీయడానికి ఒక కారణం మీరు చూపించే అభిమానమైతే.. మరో కారణం దర్శకుడు రాజమౌళి అందించిన స్ఫూర్తి. సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది’’ అని నిర్మాత కే.ఈ.జ్ఞానవేల్‌ రాజా తెలిపారు.

Updated Date - Oct 29 , 2024 | 02:01 AM