విభిన్నంగా ప్రయత్నించాను

ABN , Publish Date - Oct 17 , 2024 | 05:37 AM

‘పొట్టేల్‌’ చిత్రంలో నాలుగు పాటలుకూ చక్కటి ప్రేక్షకాధరణ లభించడం ఆనందాన్నిస్తోందని సంగీత దర్శకుడు శేఖర్‌ చంద్ర అన్నారు. యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల జంటగా సాహిత్‌ మోత్కూరి దర్శకత్వం...

‘పొట్టేల్‌’ చిత్రంలో నాలుగు పాటలుకూ చక్కటి ప్రేక్షకాధరణ లభించడం ఆనందాన్నిస్తోందని సంగీత దర్శకుడు శేఖర్‌ చంద్ర అన్నారు. యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల జంటగా సాహిత్‌ మోత్కూరి దర్శకత్వం వహించిన చిత్రమిది. సురేశ్‌ కుమార్‌ సడిగె నిర్మాత. ‘పొట్టేల్‌’ ఈ నెల 25న విడుదలవుతోన్న సందర్భంగా శేఖర్‌ చంద్ర సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ‘గ్రామీణ నేపథ్యంలో రూపొందిన చిత్రం కావడంతో ‘పొట్టేల్‌’కు సందర్భానుసారం సంగీత సృజన చేయడానికి కాస్త ఎక్కువ సమయం పట్టింది. పల్లె ప్రాంతంలో సహజమైన వాతావరణంలో ఈ సినిమాను చిత్రీకరించారు. దానికి తగినట్లు సంగీతం సమకూర్చడానికి విభిన్నంగా ప్రయత్నించాను. గ్రామీణ నేపథ్యంలో సాగే ఓ పాటను పాశ్చాత్య శైలిలో స్వరాలు సమకూర్చడం ద్వారా ఓ ప్రయోగం చేశాను. అది ప్రేక్షకులకు బాగా నచ్చుతోంది’ అన్నారు.

Updated Date - Oct 17 , 2024 | 05:37 AM