చీరకట్టులో సంప్రదాయబద్ధంగా
ABN , Publish Date - Jan 05 , 2024 | 07:01 AM
నాగార్జున ‘నా సామిరంగ’ సినిమాపై ప్రేక్షకుల్లో పాజిటీవ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. 1980ల్లో జరిగే కథ కావడం, నాగార్జునకు తోడుగా యువహీరోలు అల్లరి నరేశ్, రాజ్‌తరుణ్ నటించడం ఇవన్నీ..

నాగార్జున ‘నా సామిరంగ’ సినిమాపై ప్రేక్షకుల్లో పాజిటీవ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. 1980ల్లో జరిగే కథ కావడం, నాగార్జునకు తోడుగా యువహీరోలు అల్లరి నరేశ్, రాజ్‌తరుణ్ నటించడం ఇవన్నీ సినిమాపై అంచనాలు పెంచాయనే చెప్పాలి. విజయ్ బిన్ని దర్శకత్వంలో శ్రీనివాస్ చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం జనవరి 14న సంక్రాంతికి కానుకగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇందులో ‘మంగా’గా కీలక పాత్ర పోషిస్తున్న మిర్నా మీనన్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని చిత్రం బృందం విడుదల చేసింది. సంప్రదాయబద్ధంగా చీరకట్టులో ఉన్న మిర్నా మీనన్ స్టిల్ యువతరం మెచ్చేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రేమ, స్నేహం, భావోద్వేగాలు, మాస్, యాక్షన్ ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయని, సంక్రాంతికి సరైన సినిమా ఇదని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఆశికా రంగనాథ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి రచన: ప్రసన్నకుమార్ బెజవాడ, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కెమెరా: శివేంద్ర దాశరథి.