ప్రపంచాన్ని టాలీవుడ్ వణికిస్తోంది
ABN , Publish Date - Dec 17 , 2024 | 06:03 AM
స్వీయ దర్శకత్వంలో ఉపేంద్ర నటించిన చిత్రం‘యుఐ’. జి.మనోహరన్, కేపీ శ్రీకాంత్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. నవీన్ మనోహరన్ సహ నిర్మాత. తెలుగులో గీతా ఆర్ట్స్ ద్వారా ఈనెల 20న విడుదలవుతోంది...
స్వీయ దర్శకత్వంలో ఉపేంద్ర నటించిన చిత్రం‘యుఐ’. జి.మనోహరన్, కేపీ శ్రీకాంత్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. నవీన్ మనోహరన్ సహ నిర్మాత. తెలుగులో గీతా ఆర్ట్స్ ద్వారా ఈనెల 20న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దర్శకుడు బుచ్చిబాబు సాన, నిర్మాత ఎస్‌కేఎన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపేంద్ర మాట్లాడుతూ ‘టాలీవుడ్ ఇండియానే కాదు.. ప్రపంచాన్నే వణికిస్తుంది. రూ.1000 కోట్లు, రూ.2000 కోట్లు వసూళ్లతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతున్నారు. అయినప్పటికీ ఒక చిన్న టాలెంట్‌ని చూసి గొప్పగా ఆదరిస్తున్నారు ఇక్కడి ప్రేక్షకులు. దానికి నేనే నిదర్శనం. మా టీమ్ ‘యుఐ’ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించింది. ఇది రెగ్యులర్ ఫిల్మ్‌లా ఉండదు. సరికొత్త సినిమా అనుభూతిని కలిగిస్తుంది. ఈ చిత్రం ఒక ఊహా ప్రపంచంలా ఉంటుంది. సినిమా ఓపెనింగ్ సీన్ నుంచే షాక్ అవుతారు.
మీరు మైథలాజికల్ కల్కీ చూశారు. ఇందులో సైకలాజికల్ కల్కీ చూస్తారు’ అని అన్నారు. డైరెక్టర్ బుచ్చిబాబు సాన మాట్లాడుతూ ‘ఎన్నో సినిమాలతో ప్రయోగాలు చేశారు ఉపేంద్ర. ఈ సినిమాలో కూడా అలాంటి మ్యాజిక్ ఏదో ఉంటుందని భావిస్తున్నా’ అన్నారు. ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ మాట్లాడుతూ ‘సౌత్ ఇండియాలో మాకు తెలిసిన కల్ట్ సినిమా, కల్ట్ హీరో, కల్ట్ పర్సనాలిటీ ఉపేంద్ర’ అని అన్నారు. కార్యక్రమంలో నిర్మాత అంబికా రామచంద్రారావు, హీరోయిన్ రేష్మ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చంద్రు మనోహరన్, కో ప్రొడ్యూసర్ నవీన్ మనోహరన్ తదితరులు మాట్లాడారు.