రైతుల ఆవేదనకు అద్దం పట్టేలా
ABN , Publish Date - Feb 06 , 2024 | 01:10 AM
రాజధాని ఏర్పాటు కోసం తమ వ్యవసాయ భూములు త్యాగం చేసిన వేలాదిమంది రైతుల ఆవేదనకు అద్దం పడుతూ తెరకెక్కిన చిత్రం ‘రాజధాని ఫైల్స్’. వాస్తవ సంఘటనల ఆధారంగా...
రాజధాని ఏర్పాటు కోసం తమ వ్యవసాయ భూములు త్యాగం చేసిన వేలాదిమంది రైతుల ఆవేదనకు అద్దం పడుతూ తెరకెక్కిన చిత్రం ‘రాజధాని ఫైల్స్’. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్ కీలకపాత్రలు పోషించారు. అఖిలన్ , వీణ జంటగా నటించారు. చిత్రబృందం సోమవారం ట్రైలర్‌ను విడుదల చేసింది. ‘ఆరుకోట్ల జనాభా ఉన్న రాష్ట్రానికి నాలుగు రాజధానులా, ఇది రాజ్యాంగబద్ధమా, వ్యక్తిగత ద్వేషమా’ అనే ప్రశ్నతో మొదలైన ట్రైలర్ ఆలోచన రేకెత్తించింది. ‘మనం ఒక పాదయాత్ర చేయబోతున్నాం. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ...మహా పాదయాత్ర’ అంటూ పలికన సంభాషణలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రాన్ని తెలుగు వన్ ప్రొడక్షన్స్ బేనర్‌పై హిమబిందు సమర్పణ లో కంఠంనేని రవిశంకర్ నిర్మించారు. భాను దర్శకుడు. సంగీతం: మణిశర్మ. సినిమాటోగ్రఫీ: రమేశ్