తిన్నడి స్నేహితుడు
ABN , Publish Date - Sep 17 , 2024 | 05:32 AM
విష్ణు మంచు నటిస్తున్న ‘కన్నప్ప’ నుంచి ప్రతి సోమవారం వస్తున్న అప్‌డేట్లు సినిమా మీద అంచనాలు పెంచుతున్నాయి. ఈ సోమవారం తిన్నడికి విధేయుడు, స్నేహితుడు అయిన...
విష్ణు మంచు నటిస్తున్న ‘కన్నప్ప’ నుంచి ప్రతి సోమవారం వస్తున్న అప్‌డేట్లు సినిమా మీద అంచనాలు పెంచుతున్నాయి. ఈ సోమవారం తిన్నడికి విధేయుడు, స్నేహితుడు అయిన టిక్కీని పరిచయం చేశారు. టిక్కీ మరెవరో కాదు.. విష్ణు స్వారీ చేసే గుర్రం. టిక్కీతో ఉన్న విష్ణు పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో విష్ణు లుక్ ఆకట్టుకుంటోంది. డాక్టర్ మోహన్‌బాబు ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ‘కన్నప్ప’ చిత్రానికి ముఖేశ్‌కుమార్ సింగ్ దర్శకుడు. డిసెంబర్‌లో ఈ భారీ చిత్రం విడుదల కానుంది.