టికెట్ రేట్లు తగ్గించాలి
ABN , Publish Date - Jul 18 , 2024 | 12:36 AM
వినోద్ కిషన్, అనూష కృష్ణ జంటగా రూపుదిద్దుకున్న ‘పేకమేడలు’ చిత్రం ఈ శుక్రవారం విడుదలవుతోంది. నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో రాకేశ్ వర్రె నిర్మించారు. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో చిత్రాన్ని విడుదల చేస్తున్న...
వినోద్ కిషన్, అనూష కృష్ణ జంటగా రూపుదిద్దుకున్న ‘పేకమేడలు’ చిత్రం ఈ శుక్రవారం విడుదలవుతోంది. నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో రాకేశ్ వర్రె నిర్మించారు. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో చిత్రాన్ని విడుదల చేస్తున్న నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ ‘పెద్ద సినిమాల టికెట్ రేట్లు ఎంత ఉన్నా ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారు. ఇలాంటి చిన్న సినిమాలకు తక్కువ రేట్లు ఉండాలి. అందుకే టికెట్ రేటు వంద రూపాయలు పెట్టాం. ఇలాంటి మంచి సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లాలని పెయిడ్ ప్రీమియర్స్ కు రూ 50 పెట్టాం. సినిమా బాగుందని ప్రతి ఒక్కరూ చెప్పారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’ అని చెప్పారు. చిత్ర నిర్మాత రాకేశ్ వర్రే మాట్లాడుతూ ‘ఈ సినిమా విడుదల చేయడానికి ముందుకు వచ్చిన ధీరజ్‌కు ధన్యవాదాలు. అలాగే మా సినిమాకు సపోర్ట్ చేసిన రానా దగ్గుబాటి, అడవి శేష్, విష్వక్‌సేన్‌కు కృతజ్ఞతలు’ అన్నారు. పెయిడ్ ప్రీమియర్స్‌కు వస్తున్న రెస్పాన్స్ చూసి చాలా ఆనందంగా ఉందని వినోద్ కిషన్ చెప్పారు.