స్వేచ్చ కోసం చేసే పోరాటం
ABN , Publish Date - Aug 06 , 2024 | 04:58 AM
తమిళ నటుడు విక్రమ్ నటించిన పీరియాడికల్ యాక్షన్ చిత్రం ‘తంగలాన్’. పా.రంజిత్ దర్శకత్వంలో కే.ఈ.జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రం 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా...
తమిళ నటుడు విక్రమ్ నటించిన పీరియాడికల్ యాక్షన్ చిత్రం ‘తంగలాన్’. పా.రంజిత్ దర్శకత్వంలో కే.ఈ.జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రం 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా విక్రమ్, మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు మీడియాతో ముచ్చటించారు. హీరో విక్రమ్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా కథ ప్రపంచంలో ప్రతీ ఒక్కరికీ రిలేట్ అవుతుంది. ఈ సినిమా కథ బంగారం వేట చుట్టూ తిరిగినా.. ఇందులో స్వేచ్చ కోసం చేసే పోరాటం కూడా కీలకమే. ఈ సినిమా థియేటర్లలో చూసే వాళ్లని కచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది’’ అని చెప్పారు. హీరోయిన్ మాళవిక మోహనన్ మాట్లాడుతూ ‘‘నటిగా నన్ను ప్రూవ్ చేసుకునే పాత్రల కోసం వెతికేప్పుడు ఈ సినిమా కథ నా దగ్గరికి వచ్చింది. ఇందులో ఆరతి అనే అమ్మాయిగా కనిపిస్తాను. ఇలాంటి నేపథ్యం ఉన్న సినిమా మేకింగ్ చాలా టఫ్. ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరీ పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది.
విక్రమ్ యాక్టింగ్, డైరెక్టర్ రంజిత్ మేకింగ్ స్కిల్స్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి’’ అని అన్నారు. పార్వతి తిరువోతి మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో డైరెక్టర్ రంజిత్ ఓ నూతన ప్రపంచాన్ని సృష్టించాడు. అది తెరపై చూసిన వారంతా థ్రిల్‌కు గురవుతారు’’ అని చెప్పారు.