విడుదల తేదీ మారింది

ABN , Publish Date - Aug 21 , 2024 | 01:32 AM

వివిధ భాషల్లో సినిమాలు చేస్తూ తెలుగులో కూడా తనకంటూ అభిమానుల్ని ఏర్పరచుకున్న మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్‌’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో...

వివిధ భాషల్లో సినిమాలు చేస్తూ తెలుగులో కూడా తనకంటూ అభిమానుల్ని ఏర్పరచుకున్న మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్‌’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం కోసం 1980ల నాటి ముంబై నగరాన్ని పునర్నిర్మించడం విశేషం. మీనాక్షి చౌదరి కథానాయికగా నటించిన ఈ సినిమాను మొదట సెప్టెంబర్‌ ఏడున విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు దీపావళి సందర్భంగా అక్టోబర్‌ 31న రిలీజ్‌ చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. ఈ మార్పు గురించి చిత్ర నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య మాట్లాడుతూ ‘షూటింగ్‌ పార్ట్‌ పూర్తి చేసుకున్నా నిర్మాణానంతర కార్యక్రమాలకు అదనపు సమయం పడుతోంది. వెండితెరపై ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందించడం కోసం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాల్లో ఎక్కడా రాజీ పడడం లేదు. అందుకే విడుదల తేదీ మారింది’ అని చెప్పారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ‘లక్కీ భాస్కర్‌’ విడుదల కానుంది.

Updated Date - Aug 21 , 2024 | 01:32 AM