Kanguva: ‘కంగువ’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

ABN , Publish Date - Jun 28 , 2024 | 04:21 AM

తమిళ హీరో సూర్య పోరాట యోధుడిగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘కంగువ’. అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను గురువారం మేకర్స్‌ ప్రకటించారు. దసరా కానుకగా...

Kanguva: ‘కంగువ’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది
kanguva

తమిళ హీరో సూర్య పోరాట యోధుడిగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘కంగువ’. అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను గురువారం మేకర్స్‌ ప్రకటించారు. దసరా కానుకగా అక్టోబర్‌ 10న చిత్రం దాదాపు పది భాషల్లో త్రీడీలో, 2డీలో విడుదలవుతోంది.

ఈ భారీ పీరియాడికల్‌ యాక్షన్‌ ఫిల్మ్‌కు ‘వేదాలమ్‌’, ‘వీరుడొక్కడే’, ’వివేకం’ వంటి చిత్రాలు తీసిన శివ దర్శకత్వం వహిస్తున్నారు. దిశాపటాని, యోగిబాబు, బాబీడియోల్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘కంగువ’ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై కేఈ జ్ఞానవేల్‌రాజా, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు.

kan.jpeg


అలాగే రజనీకాంత్‌ నటించిన ‘వేట్టయాన్‌’ చిత్రం కూడా అక్టోబర్‌ 10న విడుదల కానుంది. ఈ విషయాన్ని రజనీకాంత్‌ స్వయంగా ప్రకటించారు. ఇలా అగ్ర హీరోలు ఇద్దరు నటించిన రెండు భారీ చిత్రాలు ఒకే రోజు విడుదల కానుండటంతో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

Updated Date - Jun 28 , 2024 | 07:51 AM