Samantha Vs Liver Doc: సమంతకు అతను సారీ చెప్పాడు!
ABN , Publish Date - Jul 06 , 2024 | 04:05 PM
ఆరోగ్యం, ట్రీట్‌మెంట్ గురించి సమంత (Samantha) ఇన్ స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్ ఎంతగా వైరల్ అయిందో తెలిసిందే! 'సమంత సలహాలు వింటే డైరెక్ట్‌గా చావే’ అని విమర్శించిన డాక్టర్ లివర్ డాక్ (The Liver doc) సామ్‌కు క్షమాపణలు చెప్పారు.
ఆరోగ్యం, ట్రీట్‌మెంట్ గురించి సమంత (Samantha) ఇన్ స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్ ఎంతగా వైరల్ అయిందో తెలిసిందే! 'సమంత సలహాలు వింటే డైరెక్ట్‌గా చావే’ అని విమర్శించిన డాక్టర్ లివర్ డాక్ (The Liver doc) సామ్‌కు క్షమాపణలు చెప్పారు. కొన్ని రోజులుగా సమంతకు ఆయనకు మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం జరుగుతోంది. ఆయన సమంత ఇచ్చిన హెల్త్ టిప్‌ను విమర్శించే క్రమంలో ఆమెను బలమైన పదాలతో దూషించారు. తాజాగా దీనిపై సమంత సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. దాంతో ఆయన సమంతకు క్షమాపణ చెప్పారు. కానీ ఆమెకు వైద్యం చేసే డాక్టర్‌ను మాత్రం తప్పుపట్టారు.
‘‘నేను సమంత ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకున్నాను. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ఆమె చెప్పిన హెల్త్ టిప్‌ను ఖండించిన తీరుకు ఆమె బాధపడ్డారు. ఇందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను. అది అనుకోకుండా జరిగింది. ఆమెను విమర్శించడం నా ఉద్దేశం కాదు. ఆమెకు ఆ చికిత్స చెప్పిన డాక్టర్‌ది తప్పు. ఆయన తన సొంత లాభం కోసం సమంత లాంటి సెల్రబిటీల ద్వారా హానికరమైన సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు. దీన్ని నేను ఖండించాను, సమంతను అనడం నా ఉద్దేశం కాదు’’ అని రాశారు. సమంతకు ట్రీట్‌మెంట్ చేసే డాక్టర్‌ను లివర్ డాక్ తీవ్రంగా విమర్శించారు. ఆయనపై ఇప్పటికే పలు కేసులు ఉన్నట్లు చెప్పారు. ఆయన ఎంబీబీఎస్ చేసిన డాక్టర్ కాదని ప్రకృతి వైద్యుడని అన్నారు. గతంలోనూ ప్రజారోగ్యానికి హాని కలిగించే పలు ఉత్పత్తులను పోత్సహించినందుకు ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకుందని గుర్తు చేశారు.