తెలంగాణ నేపథ్యంలో తొలి డిటెక్టివ్ వెబ్ సిరీస్
ABN , Publish Date - Nov 15 , 2024 | 03:34 AM
నరేశ్ అగస్త్య, మేఘా ఆకాశ్ ప్రధాన పాత్రలు పోషించిన ‘వికటకవి’ వెబ్ సిరీస్ ఈ నెల 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ సిరీస్‌కు ప్రదీప్ మద్దాలి దర్శకత్వం...
నరేశ్ అగస్త్య, మేఘా ఆకాశ్ ప్రధాన పాత్రలు పోషించిన ‘వికటకవి’ వెబ్ సిరీస్ ఈ నెల 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ సిరీస్‌కు ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించారు. తెలంగాణ నేపథ్యంలో రూపుదిద్దుకున్న తొలి డిటెక్టివ్ వెబ్ సిరీస్ ఇదే. తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రదీప్ మాట్లాడుతూ ‘స్వాతంత్య్రం రాకముందు మన దేశంలో చాలా సంస్థానాలు ఉండేవి. వాటిల్లో తెలంగాణకు చెందిన అమరగిరి ప్రాంతం ఒకటి. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్నారు. కొన్నాళ్లకు ఊరు మునిగిపోతుంది అనగా ఏం జరిగింది అనే బ్యాక్‌డ్రాప్‌లో తీసిన సిరీస్ ఇది, 1940ల్లో అమరగిరి ప్రాంతంలో ఒక సంఘటన జరుగుతుంది. 1970లో అది పునరావృతమవుతుంది. ఇలా జరగడాన్ని అమ్మోరు శాపంగా అక్కడి ప్రజలు భావిస్తుంటారు. హీరో ఈ సమస్యను ఎలా పరిష్కరించాడన్నది ఆసక్తికరం.
అప్పటి ప్రపంచాన్ని క్రియేట్ చేసి తెరకు ఎక్కించడం కిక్ ఇచ్చింది. కంటెంట్ ప్రకారం రాయల్ లుక్‌తో చూపిస్తూ మంచి థ్రిల్లర్‌గా రూపొందించాను.’ అన్నారు. ఇందులో నరేశ్ డిటెక్టివ్‌గా, అమరగిరి యువరాణిగా మేఘా ఆకాశ్ అద్భుతంగా నటించారని ప్రదీప్ చెప్పారు.