అమ్మ మనసు బాధపడితే..

ABN , Publish Date - Oct 19 , 2024 | 06:18 AM

అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రేమమయిగానే కాదు త్యాగమూర్తిగా కూడా ఆమెకు సాటి మరెవరూ లేరు. అటువంటి ఓ అమ్మ మనసు ఎలాంటి భావోద్వేగాలకు గురైంది,

అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రేమమయిగానే కాదు త్యాగమూర్తిగా కూడా ఆమెకు సాటి మరెవరూ లేరు. అటువంటి ఓ అమ్మ మనసు ఎలాంటి భావోద్వేగాలకు గురైంది, అందుకు దారి తీసిన పరిస్థితులు ఏమిటి.. అనే అంశాలతో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘తల్లి మనసు’. రచిత మహాలక్ష్మి, కమల్‌ కామరాజు, సాత్విక్‌, సాహిత్య ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని సీనియర్‌ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సమర్పణలో ఆయన తనయుడు కిశోర్‌ నిర్మిస్తున్నారు. చిత్రం ప్రోగ్రెస్‌ గురించి ఆయన మాట్లాడుతూ ‘షూటింగ్‌ పార్ట్‌ , డబ్బింగ్‌ పూర్తయ్యాయి. మిగిలిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంతో జరుగుతున్నాయి. సోషల్‌ మీడియా లో గురువారం టీజర్‌ను విడుదల చేశాం. అద్భుతమైన స్పందన వస్తోంది’ అని తెలిపారు.‘మంచి కథ, కథనాలతో తొలి ప్రయత్నంగా మా బేనర్‌లో ఒక సినిమా తీయాలని సంకల్పించి ఈ సినిమా తీశాం. నవంబర్‌లో విడుదల చేస్తాం’ అని చెప్పారు ముత్యాల సుబ్బయ్య. ఓ మధ్యతరగతి తల్లి కథ ఇదనీ, ప్రేక్షకులను ఆకట్టుకొనే రీతిలో రూపొందించామనీ దర్శకుడు వి.శ్రీనివా్‌స(సిప్పీ) చెప్పారు.

Updated Date - Oct 19 , 2024 | 06:18 AM