‘దేవర’ నటుడికి అరుదైన వ్యాధి

ABN , Publish Date - Aug 07 , 2024 | 01:01 AM

మలయాళ నటుడు షైన్‌ టామ్‌చాకో.. ‘దసరా’, ‘రంగబలి’ వంటి సినిమాలలో ప్రతినాయక పాత్రలతో తెలుగులోనూ పాపులర్‌ అయ్యారు. ఇప్పుడు ఆయన ఎన్టీఆర్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘దేవర’లో...

మలయాళ నటుడు షైన్‌ టామ్‌చాకో.. ‘దసరా’, ‘రంగబలి’ వంటి సినిమాలలో ప్రతినాయక పాత్రలతో తెలుగులోనూ పాపులర్‌ అయ్యారు. ఇప్పుడు ఆయన ఎన్టీఆర్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘దేవర’లోనూ విలన్‌గా కనిపించనున్నారు. ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో.. తనకు అటెన్షన్‌ డెఫిసిటీ హైపర్‌ యాక్టివిటీ డిజార్డర్‌ (ఏ.డీ.హెచ్‌.డీ) ఉందని తెలిపారు. ఈ వ్యాధి ఉండే వారు ఇతరుల కంటే ప్రత్యేకంగా కనిపించడానికి ప్రయత్నిస్తారని.. అయితే ఇందుకు తానేం బాధపడట్లేదని.. దీన్నో పాజిటివ్‌ క్వాలిటీగా భావిస్తా అని చెప్పారు.

Updated Date - Aug 07 , 2024 | 01:01 AM