పెద్దనాన్న మాటతో నమ్మకం మరింత పెరిగింది

ABN , Publish Date - Nov 03 , 2024 | 01:06 AM

వరుణ్‌ తేజ్‌ హీరోగా కరుణకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మట్కా’. మీనాక్షి చౌదరి హీరోయిన్‌. విజయేందర్‌ రెడ్డి తీగల, రజని తాళ్లూరి నిర్మాతలు. ఈనెల 14న సినిమా విడుదలవుతున్న సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను శనివారం...

వరుణ్‌ తేజ్‌ హీరోగా కరుణకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మట్కా’. మీనాక్షి చౌదరి హీరోయిన్‌. విజయేందర్‌ రెడ్డి తీగల, రజని తాళ్లూరి నిర్మాతలు. ఈనెల 14న సినిమా విడుదలవుతున్న సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను శనివారం రిలీజ్‌ చేశారు. హీరో వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ‘ వాసు అనే వ్యక్తి ప్రయాణమే ఈ కథ. 1958లో చిన్నతనంలోనే శరణార్థిగా బర్మా నుంచి వైజాగ్‌ వస్తాడు. అక్కడి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ ‘మట్కా’ కింగ్‌లా ఎలా మారాడనేది కథ. వంద శాతం ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరిస్తుంది. పెద్దనాన్న చిరంజీవికి వారం క్రితం ట్రైలర్‌ చూపించా. నచ్చింది, మాస్‌గా ఉందన్నారు. దాంతో నా నమ్మకం మరింత బలపడింది. సినిమాలో మీనాక్షి పాత్ర కీలకమైంది. వాసు దగ్గర ఏమీ లేనప్పుడు అమె అండగా నిలుస్తుంది. నటనకు ఆస్కారం ఉండే పాత్రలు చేయాలన్నదే నా కోరిక. ‘గద్దలకొండ గణేశ్‌’ తర్వాత అలాంటి ప్రాజెక్ట్‌ దొరకలేదు. గత మూడు చిత్రాలు సరిగ్గా ఆడలేదు.


విభిన్నమైన సినిమా చేయాలనుకుంటున్న తరుణంలో కరుణకుమార్‌ ఈ కథ చెప్పారు. నా గత చిత్రాలు విడుదల కాకముందే ఈ సినిమా ఓకే చేశా. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది’ అని చెప్పారు. దర్శకుడు కరుణ కుమార్‌ మాట్లాడుతూ‘రతన్‌ ఖత్రీ అనే గ్యాంబ్లర్‌ స్టోరీని ఆధారంగా చేసుకొని ‘మట్కా’ అనే ఫీక్షనల్‌ కథను సిద్ధం చేశా. అలాంటి వ్యక్తి వైజాగ్‌లో పుడితే ఎలా ఉంటుంది? అనేదానికి కమర్షియల్‌ హంగులు జోడించి తీర్చిదిద్దాం’ అని చెప్పారు. నిర్మాత విజయేందర్‌రెడ్డి మాట్లాడుతూ ‘ఫస్ట్‌ డే కథ విన్నప్పుడు ఎంత థ్రిల్‌ ఫీలయ్యానో ఈ టీజర్‌ చూసి అంతకంటే గొప్ప అనుభూతి పొందాను. సినిమా బాగా వచ్చింది’ అని ప్రశంసించారు.

Updated Date - Nov 03 , 2024 | 01:07 AM