అందుకే ఈ టైటిల్ లైకా ప్రొడక్షన్స్
ABN , Publish Date - Oct 10 , 2024 | 05:52 AM
అందుకే ఈ టైటిల్ లైకా ప్రొడక్షన్స్
రజనీకాంత్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘వేట్టయాన్’. ‘జై భీమ్’ ఫేమ్ టీ.జే.జ్ఞానవేల్ దర్శకత్వంలో సుభాస్కరన్ నిర్మించారు. నేడు ఈ చిత్రం విడుదలవుతోంది. బుధ వారం చిత్ర బృందం నిర్వహించిన మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘ఈ సినిమా టైటిల్ విషయంలో ట్రోలింగ్స్ వస్తుండడం చూశా. సాధ్యమైనంత వరకూ టైటిల్స్‌ను స్థానిక భాషలోనే పెడుతున్నారు. సినిమాను సినిమాగా చూడండి’’ అని చెప్పారు. ‘తెలుగు ప్రేక్షకులంతా ‘వేట్టయాన్’ను చూసి విజయవంతం చేయండి’’ అని నిర్మాత సురేశ్‌బాబు కోరారు.
గేమ్ చేంజర్ విషయంలో అదే జరిగింది : దిల్‌రాజు
‘‘గేమ్ చేంజర్’కి డైరెక్టర్ టైటిల్ చెప్పినప్పుడు.. ఆ టైటిల్‌ను అన్ని భాషల్లో చెక్ చేశాం. పాన్ ఇండియా సినిమాకు టైటిల్ పెడితే అన్ని భాషల్లోకి అదే టైటిల్‌తో వెళ్లాలి. మనం అనుకునే పాన్ ఇండియా టైటిల్‌ను వేరే భాషల్లో రిజిస్టర్ చేసి ఉంటే చాలా సమస్య అవుతుంది. గేమ్ చేంజర్ విషయంలో అదే జరిగింది. ఈ టైటిల్ కోసం మళ్లీ అందరితో మాట్లాడి.. ఒప్పించి అప్పుడు అన్ని భాషల్లో ఒకేలా ఉండే టైటిల్‌ను ప్రకటించాం. పాన్ ఇండియాకు టైటిల్ పెట్టడం అంత సులభం కాదు’’ అని దిల్‌రాజు అన్నారు..