ఆ తిలకం ఇంకా మెరుస్తూనే ఉంది

ABN , Publish Date - Sep 04 , 2024 | 03:30 AM

‘తాతమ్మ కల’ చిత్రంతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి, యాభై ఏళ్ల నట జీవితాన్ని పూర్తి చేసుకున్న నందమూరి బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవం ఇటీవల వైభవంగా జరిగిన సంగతి విదితమే. ఈ కార్యక్రమాన్ని...

‘తాతమ్మ కల’ చిత్రంతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి, యాభై ఏళ్ల నట జీవితాన్ని పూర్తి చేసుకున్న నందమూరి బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవం ఇటీవల వైభవంగా జరిగిన సంగతి విదితమే. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘యాభై ఏళ్ల క్రితం మా నాన్నగారు నా నుదిటిన దిద్దిన తిలకం ఇంకా మెరుస్తూనే ఉంది. యాభై ఏళ్ల నా నట ప్రస్థానం సాగుతూనే ఉంది. వెలుగుతూనే ఉంది. తెలుగు భాష ఆశీస్సులతో, తెలుగు జాతి అభిమాన నీరాజనాలతో పెనవేసుకున్న బంధం ఇది. ఈ రుణం తీరనిది. ఈ జన్మ మీ కోసం.. మీ ఆనందం కోసం. నా ఈ ప్రయాణంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను’ అని చెప్పారు బాలకృష్ణ. రెండు తెలుగు రాష్ట్రాలను వరద ముంచెత్తుతున్న ఈ తరుణంలో ఆయన స్పందిస్తూ


‘ఈ విపత్కర పరిస్థితుల్లో బాదాతప్త హృదయంతో నా బాధ్యతగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 50 లక్షలు బాధిత ప్రజల సహాయార్ధం విరాళంగా అందిస్తున్నాను. తెలుగు రాష్ట్రాల్లో అతి త్వరలోనే మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నా’ అని వెల్లడించారు.

Updated Date - Sep 04 , 2024 | 03:30 AM