ఆ వీధికి బాలు పేరు

ABN , Publish Date - Sep 26 , 2024 | 01:17 AM

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (ఎస్పీబీ) వర్థంతి సందర్భంగా ఆయన అభిమానులకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ స్వాంతన చేకూర్చే కబురందించారు. బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్‌ కోరిక మేరకు స్థానిక నుంగంబాక్కంలోని కామ్‌దార్‌నగర్‌ మొదటివీధి పేరును...

  • సీఎం స్టాలిన్‌ ఉత్తర్వులు

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (ఎస్పీబీ) వర్థంతి సందర్భంగా ఆయన అభిమానులకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ స్వాంతన చేకూర్చే కబురందించారు. బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్‌ కోరిక మేరకు స్థానిక నుంగంబాక్కంలోని కామ్‌దార్‌నగర్‌ మొదటివీధి పేరును మార్చేందుకు స్టాలిన్‌ అంగీకరించారు. ఆ మేరకు బుధవారం సాయంత్రం ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం యేళ్ల తరబడి నివసించిన కామదార్‌నగర్‌ ఫస్ట్‌స్ట్రీట్‌ పేరును ‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రోడ్డు’గా మార్చుతున్నట్లు ప్రకటించారు. ఎస్పీబీ భౌతికంగా లేకపోయినా వివిధ భాషల్లో ఆయన పాడిన పాటల ద్వారా అభిమానుల మనస్సుల్లో చిరంజీవిగా సుస్థిరంగా నిలిచి ఉంటారని స్టాలిన్‌ ఈ సందర్భంగా కొనియాడారు.

చెన్నై(ఆంధ్రజ్యోతి)

Updated Date - Sep 26 , 2024 | 01:17 AM