నా ఇంటి పేరు అది కాదు

ABN , Publish Date - Sep 10 , 2024 | 03:35 AM

నటిగా సెలక్టివ్‌ పాత్రలు ఎంచుకుని తన నటనతో అందరినీ ఫిదా చేస్తుంటారు నిత్యామేనన్‌. ఇటీవలే మీడియాతో ముచ్చటించిన ఆమె.. అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసే...

నటిగా సెలక్టివ్‌ పాత్రలు ఎంచుకుని తన నటనతో అందరినీ ఫిదా చేస్తుంటారు నిత్యామేనన్‌. ఇటీవలే మీడియాతో ముచ్చటించిన ఆమె.. అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసే ఓ విషయాన్ని పంచుకున్నారు. ‘‘చాలా మంది నా ఇంటి పేరు మేనన్‌. నా స్వస్థలం కేరళ అనుకుంటారు. నిజానికి నా ఇంటి పేరు మేనన్‌ కాదు. నా పేరు ఎన్‌.ఎ్‌స.నిత్య. ఎన్‌ అంటే మా అమ్మ నళిని. ఎస్‌ అంటే మా నాన్న సుకుమార్‌. మాది బెంగుళూరు. మా కుటుంబం మూడు తరాలుగా బెంగుళూరులోనే ఉంటోంది. మేమంతా ఇంటి పేరును గోప్యంగా ఉంచడానికి ఇష్టపడతాం. మా కులమిదని చెప్పుకోవడం కూడా మాకు ఇష్టం ఉండదు. కేవలం న్యూమరాలజీ ఆధారంగా నా పేరు తర్వాత ‘మేనన్‌’ జతచేసుకున్నాను’’ అని చెప్పారు.

Updated Date - Sep 10 , 2024 | 03:35 AM