అందరికీ ధన్యవాదాలు

ABN , Publish Date - Aug 21 , 2024 | 01:34 AM

తన ఆరోగ్యం బాగుండాలని కోరుతూ దేవుడిని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్టు ప్రముఖ నేపథ్యగాయని పి.సుశీల పేర్కొన్నారు. అనారోగ్యం కారణంగా ఈ నెల 17న నగరంలోని...

తన ఆరోగ్యం బాగుండాలని కోరుతూ దేవుడిని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్టు ప్రముఖ నేపథ్యగాయని పి.సుశీల పేర్కొన్నారు. అనారోగ్యం కారణంగా ఈ నెల 17న నగరంలోని ఒక కార్పొరేట్‌ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరిన ఆమె... సోమవారం రాత్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఆ తర్వాత ఆమె భావోద్వేగంతో అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ ఒక వీడియోను రిలీజ్‌ చేశారు. ‘తమిళ అభిమానులకు నాపై ప్రత్యేక ప్రేమ ఉంది. వారికి పాటలంటే ప్రాణం. అందుకే భగవంతుడు నన్ను పంపాడు. దేవుడు నాకు ఇంత మంచి గొంతు ఎందుకు ఇచ్చాడో ఇప్పుడు అర్థమైంది. దేవుడి దయ వల్లే ఇదంతా సాధ్యమైంది’ అని ఆమె పేర్కొన్నారు.

(చెన్నై, ఆంధ్రజ్యోతి)

Updated Date - Aug 21 , 2024 | 01:34 AM