Saala: ‘సాలా’ టీమ్‌కు అల్లు అర్జున్ బెస్ట్ విషెస్

ABN , Publish Date - Aug 23 , 2024 | 09:58 PM

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. ధీరన్ హీరోగా నిర్మించిన తమిళ మూవీ ‘సాలా’. ఈ సినిమా శుక్రవారం గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సందర్భంగా ‘సాలా’ సినిమా యూనిట్‌కు తన బెస్ట్ విషెస్ అందించారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తన మిత్రుడు టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ‘సాలా’ సినిమా కోలీవుడ్‌లో బిగ్ బ్లాక్ బస్టర్ ఇవ్వాలని అల్లు అర్జున్ ఈ సందర్భంగా కోరారు.

Saala Team with Icon Star Allu Arjun

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory).. ధీరన్ హీరోగా నిర్మించిన తమిళ మూవీ ‘సాలా’ (Saala). ఈ సినిమా శుక్రవారం గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సందర్భంగా ‘సాలా’ సినిమా యూనిట్‌కు తన బెస్ట్ విషెస్ అందించారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తన మిత్రుడు టీజీ విశ్వప్రసాద్‌ (TG Vishwaprasad) నిర్మించిన ‘సాలా’ సినిమా కోలీవుడ్‌లో బిగ్ బ్లాక్ బస్టర్ ఇవ్వాలని అల్లు అర్జున్ ఈ సందర్భంగా కోరారు. హీరో ధీరన్, హీరోయిన్ రేష్మ వెంకటేష్, ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్, డైరెక్టర్ ఎస్‌డీ మణిపాల్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను మీట్ అయ్యారు. (Allu Arjun Best Wishes to Saala Team)

Also Read- Cinema Review: మారుతీనగర్‌ సుబ్రమణ్యం


Saala.jpg

ఈ సందర్భంగా ‘సాలా’ టీమ్ స్పందిస్తూ.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌‌ (Icon Star Allu Arjun)కు ధన్యవాదాలు. ఆయన మా టీమ్‌కి శుభాకాంక్షలు చెబుతూ.. ప్రతి ఒక్కరినీ ఎంతో ప్రేమగా పలకరించారు. ఎంతో ఎంకరేజ్ చేశారు. నిజంగా మాకు చాలా సంతోషంగా అనిపించింది. థ్యాంక్యూ ఐకాన్ స్టార్ (Thank You Icon Star) అని అన్నారు. ‘సాలా’ సినిమాను రాయపురంలోని ఫేమస్ పార్వతీ బార్ (Parvathi Bar) నేపథ్యంతో యాక్షన్ డ్రామాగా దర్శకుడు ఎస్ డీ మణిపాల్ రూపొందించారు. ధీరన్, రేష్మ వెంకటేష్, చార్లెస్ వినోద్, శ్రీనాథ్, అరుల్ దాస్, సంపత్ రామ్, అల్ అజీనా, అతులథ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి వివేక్ వివేక్ కూచిభొట్ల సహనిర్మాత.

Also Read- Demonte Colony 2 Review: ‘డిమోంటి కాలనీ 2’ మూవీ రివ్యూ

TG-Vishwaprasad.jpg

Read Latest Cinema News

Updated Date - Aug 23 , 2024 | 09:58 PM