టాక్సీ డ్రైవర్‌ కథ

ABN , Publish Date - Dec 01 , 2024 | 06:31 AM

మోహన్‌లాల్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘తుడరమ్‌’. ఆయనకు జోడీగా శోభన నటిస్తున్నారు. తరుణ్‌ మూర్తి దర్శకుడు. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మోహన్‌లాల్‌...

మోహన్‌లాల్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘తుడరమ్‌’. ఆయనకు జోడీగా శోభన నటిస్తున్నారు. తరుణ్‌ మూర్తి దర్శకుడు. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మోహన్‌లాల్‌ టాక్సీ డ్రైవర్‌గా నటిస్తున్నారు. శోభన గృహిణి పాత్రలో కనిపించనున్నారు. తాజాగా చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్‌లో మోహన్‌లాల్‌కు శోభన టీ గ్లాస్‌ అందిస్తూ కనిపించారు. అయితే గతంలో వీరిద్దరూ జంటగా నటించిన ‘నడోడికట్టు’ చిత్రంలోనూ ఇలాంటి సన్నివేశమే ఉంది. 1987లో విడుదలైన ఆ చిత్రంలో ‘వైశాఖసంధ్యే’ అంటూ సాగే గీతంలో మోహన్‌లాల్‌, శోభన టీ తాగుతూ కనిపించారు. ఆ సినిమా విడుదలై 37 ఏళ్లు అవుతోంది. దాంతో ఈ రెండు పోస్టర్స్‌ని పక్కపక్కన ఉంచి అభిమానులు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు.

Updated Date - Dec 01 , 2024 | 06:31 AM