మహాశివరాత్రికి తమ్ముడు
ABN , Publish Date - Nov 05 , 2024 | 06:46 AM
పవన్‌కల్యాణ్ హీరోగా గతంలో ‘తమ్ముడు’ పేరుతో ఓ సినిమా వచ్చింది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు అదే టైటిల్‌తో మరో సినిమా వస్తోంది. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు...
పవన్‌కల్యాణ్ హీరోగా గతంలో ‘తమ్ముడు’ పేరుతో ఓ సినిమా వచ్చింది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు అదే టైటిల్‌తో మరో సినిమా వస్తోంది. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరిలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటిస్తూ రిలీజ్ డేట్ పోస్టర్‌ను కూడా వదిలారు. కాగడా చేత పట్టిన నితిన్, భుజాన ఓ పాపను ఎత్తుకుని పరిగెడుతూ రావడం, ఆయనతో పాటు ఊరి ప్రజలు కూడా కాగడాలతో అనుసరిస్తుండడం ఆసక్తి కలిగిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న 56వ చిత్రమిదనీ, ఇందులో నటి లయ కీలక పాత్రను పోషిస్తోందనీ నిర్మాతలు వెల్లడించారు. ‘వకీల్ సాబ్’ చిత్రం తర్వాత దర్శకుడు శ్రీరామ్ వేణు రూపొందిస్తున్న చిత్రం కావడంతో ‘తమ్ముడు’ మీద భారీ అంచనాలు ఉన్నాయి.