Da Da: తమిళ్‌లో ‘డా డా’.. తెలుగులో టైటిల్ ఏంటంటే..
ABN , Publish Date - Nov 30 , 2024 | 02:04 PM
తమిళ్‌లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘డా.. డా.’ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా తెలుగు టైటిల్ ఏంటి? ఎప్పుడు విడుదల కాబోతోంది? తెలుగులో ఈ చిత్రాన్ని ఎవరు విడుదల చేస్తున్నారనే వివరాలిలా ఉన్నాయి..
తమిళ్‌లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘డా.. డా’ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ‘డా.. డా’ చిత్రాన్ని తెలుగులో ‘పా.. పా..’ (Pa Pa) టైటిల్‌తో జెకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై, నిర్మాత నీరజ కోట (Neeraja Kota) విడుదల చేయబోతున్నారు. డిసెంబర్ 13న ఈ చిత్రాన్ని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతో పాటు అమెరికా, ఆస్ట్రేలియాలలోని థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
Also Read-Allu Arjun: ఆర్మీ తెచ్చిన తంట.. అల్లు అర్జున్‌పై పోలీసులకు ఫిర్యాదు
‘డా.. డా’ విషయానికి వస్తే.. గత ఏడాది తమిళంలో విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. కవిన్, అపర్ణ దాస్ ప్రధాన పాత్రదారులుగా, డైరెక్టర్ గణేష్ కె బాబు తెరకెక్కించిన ‘డా..డా’ చిత్రం తమిళ ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా భారీగా కలెక్షన్స్‌ను రాబట్టింది. కోలీవుడ్ ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్‌లకు కాసుల వర్షం కురిపించింది. అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు రూ. 30 కోట్లు వసూళ్లు సాధించి.. కోలీవుడ్ బాక్సాఫీస్‌ని ఆశ్చర్యపరిచింది.
తండ్రి కొడుకుల సెంటిమెంట్‌తో ఒక ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ‘డా..డా’ చిత్రం ఇప్పుడు ‘పా.. పా..’ పేరుతో తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకుని, మంచి విజయం అందుకుంటుందని ఆశిస్తున్నట్లుగా నిర్మాత నీరజ కోట తెలిపారు. కామెడీ, భావోద్వేగం, ప్రేమ.. ఇవన్నీ సరైన స్థాయిలో మిక్స్ చేసిన ఈ ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా.. తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అవుతుందని, బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంజీఎం సంస్థ నుంచి అచ్చిబాబు విడుదల చేయబోతున్నారని తెలిపారు.
Also Read- Allu Arjun: నన్ను స్టార్‌ను చేసింది ఆయనే..
Also Read-Chai Sobhita: డోల్ డోల్ డోల్ భాజే.. అక్కినేని ఇంట్లో సంబరాలే
Also Read-Prashanth Varma: సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే.. గెట్ రెడీ ఫర్ 'మోక్షజ్ఞ'
-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి