నాగసాధు పాత్రలో తమన్నా
ABN, Publish Date - Oct 09 , 2024 | 01:00 AM
‘ఓదెల రైల్వే స్టేషన్’ చిత్రానికి సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటున్న ‘ఓదెల 2’ చిత్రం షూటింగ్ కొనసాగుతోంది. మహాదేవుని ఆశీస్సులతో వారణాసిలో ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఓదెల మల్లన్న క్షేత్రంలో...
‘ఓదెల రైల్వే స్టేషన్’ చిత్రానికి సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటున్న ‘ఓదెల 2’ చిత్రం షూటింగ్ కొనసాగుతోంది. మహాదేవుని ఆశీస్సులతో వారణాసిలో ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఓదెల మల్లన్న క్షేత్రంలో జరుగుతోంది. తన కెరీర్‌లోనే తొలిసారిగా తమన్నా ఇందులో శివశక్తి(నాగసాధు) పాత్ర పోషిస్తున్నారు. ఆమెతో పాటు మురళీశర్మ, హెబ్బా పటేల్ తదితరులు షూటింగ్‌లో పాల్గొంటున్నారు. మల్లన్న ఆలయం, ఓదెల గ్రామంలోని అందమైన ప్రదేశాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దర్శకుడు సంపత్‌నంది పర్యవేక్షణలో అశోక్ తేజ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని డి. మధు నిర్మిస్తున్నారు.