Trisha : ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ..

ABN , Publish Date - Dec 14 , 2024 | 06:38 AM

తమిళ హీరో సూర్య నటించే 45వ చిత్రం ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ పొల్లాచ్చిలో జరుగుతోంది. ఇందులో హీరోయిన్‌గా త్రిష నటిస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ఎస్‌.ఆర్‌. ప్రకాశ్‌బాబు,

తమిళ హీరో సూర్య నటించే 45వ చిత్రం ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ పొల్లాచ్చిలో జరుగుతోంది. ఇందులో హీరోయిన్‌గా త్రిష నటిస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ఎస్‌.ఆర్‌. ప్రకాశ్‌బాబు, ఎస్‌.ఆర్‌. ప్రభు చెప్పారు. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ సూర్య, త్రిష ఇందులో జంటగా నటిస్తుండడం విశేషం. పేరు నిర్ణయించని ఈ సినిమాలో సూర్య, త్రిష ఇద్దరూ లాయర్‌ పాత్రలు పోషిస్తుండడం మరో విశేషం. హై బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆర్జే బాలాజీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

Updated Date - Dec 14 , 2024 | 06:38 AM