Prema Charitra - Krishna Vijayam: సూపర్ స్టార్ కృష్ణకు మనమిచ్చే ఘన నివాళి అదే

ABN , Publish Date - Nov 16 , 2024 | 02:19 PM

తెలుగు సినిమా చరిత్రలో సూపర్ కృష్ణ‌కు ఒక ప్రత్యేక పేజీ ఉంది. తెలుగు సినిమాకు ఎన్నో సొబగులు అద్దారాయన. అలాంటి సూపర్ స్టార్ నటించిన చివరి చిత్రం ప్రేమ చరిత్ర - కృష్ణ విజయం విడుదలకు సిద్ధమైంది. నవంబర్ 16, సూపర్ స్టార్ కృష్ణ ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.

Prema Charitra Krishna Vijayam Release Date Announcement

టాలీవుడ్ చరిత్రలో సౌజన్యానికి, సాహసానికి నిలువెత్తు నిర్వచనంగా నిలిచిన సూపర్ స్టార్ కృష్ణ నటించిన చివరి చిత్రం ‘ప్రేమ చరిత్ర - కృష్ణ విజయం’. అంబుజా మూవీస్ - రామ్ ఫిల్మ్స్ బ్యానర్స్‌పై హెచ్.మధుసూదన్ దర్శకనిర్మాతగా రూపొందించిన ఈ చిత్రంలో యశ్వంత్ - సుహాసిని జంటగా నటించారు. మెగా బ్రదర్ నాగబాబు, ఆలీ వంటి వారు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. నవంబర్ 16, సూపర్ స్టార్ కృష్ణ ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ.. ఈ చిత్ర టీమ్ ‘ప్రేమ చరిత్ర - కృష్ణ విజయం’ విడుదల తేదీని ప్రకటించింది.

Also Read-Amaran: ‘అమరన్’ థియేటర్‌పై బాంబ్ దాడి.. ఏమైందంటే

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి నిర్మాతల మండలి అధ్యక్షులు కె.ఎల్.దామోదర్ ప్రసాద్, దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్, ప్రముఖ దర్శకనిర్మాత సునీల్ కుమార్ రెడ్డి, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, ‘హతవిధి’ చిత్ర హీరోయిన్ కమ్ ప్రొడ్యూసర్ మధుమిత, కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఖాదర్ గోరి, పద్మాలయ శర్మ, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ, దర్శకనిర్మాత హెచ్. మధుసూదన్, సహ నిర్మాత బండ్రి నాగరాజ్ గుప్తా తదితరులు పాల్గొని సూపర్ స్టార్‌కు ఘన నివాళి అర్పించారు. అనంతరం ఈ సినిమాను జనవరి 3న సంక్రాంతి స్పెషల్‌గా విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారంతా.. ‘ప్రేమచరిత్ర - కృష్ణ విజయం’ కృష్ణ నటించిన చివరి చిత్రంగా చరిత్రలో నిలిచిపోతుందని, కృష్ణను అభిమానించే ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూడాలని అతిధులు ఆకాంక్షించారు. ఇదే ఆయనకు ఇచ్చే ఘననివాళిగా వారు అభివర్ణించారు. సూపర్ స్టార్ కృష్ణకు సంక్రాంతితో గల అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా దర్శకనిర్మాత అయిన మధుసూదన్‌ను అంతా అభినందించారు.


Krishna.jpg

అనంతరం దర్శకనిర్మాత మధుసూదన్ మాట్లాడుతూ.. ‘‘సూపర్ స్టార్ కృష్ణతో సినిమా రూపొందించడం తన అదృష్టంగా భావించానని, ఆయన నటించిన ఆఖరు చిత్రం విడుదల కాని చిత్రాల జాబితాలో ఉండకూడదనే పట్టుదలతో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నామని తెలిపారు. ఆధునిక సాంకేతిక హంగులన్నీ అద్దుకున్న ఈ చిత్రం కృష్ణ అభిమానులతోపాటు అందరినీ అమితంగా అలరిస్తుందని మధుసూదన్ చెప్పుకొచ్చారు.

Also Read-S Thaman: మ్యూజిక్ సెన్సేషన్ తమన్ బర్త్‌డే స్పెషల్ ఇంటర్వ్యూ..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 16 , 2024 | 02:19 PM