సుబ్బమ్మ సందేశం
ABN , Publish Date - Aug 26 , 2024 | 05:52 AM
చక్కని సందేశంతో పాటు ఆకట్టుకునే ప్రేమకథతో రూపొందుతున్న చిత్రం ‘ఈమె సుబ్బమ్మ ఇదియే ఈమె కథ’. కిరణ్ దర్శకత్వంలో మంద మల్లికార్జున్‌రెడ్డి నిర్మిస్తున్నారు..
చక్కని సందేశంతో పాటు ఆకట్టుకునే ప్రేమకథతో రూపొందుతున్న చిత్రం ‘ఈమె సుబ్బమ్మ ఇదియే ఈమె కథ’. కిరణ్ దర్శకత్వంలో మంద మల్లికార్జున్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఆదివారం చిత్రీకరణ ప్రారంభమైంది. తొలి షాట్‌కు మల్లికార్జున రెడ్డి క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది’ అన్నారు. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు. శ్యామ్ సెల్వన్, హాన్విక హీరో హీరోయిన్లు. సంగీతం: చరణ్ అర్జున్, సినిమాటోగ్రఫీ: గాజుల శివ.